అఆఇఈ… అహం నించి ఆత్మ దాకా, ఇహం నించి ఈశ్వరుడి దాకా… అన్న శీర్షికకు సంక్షిప్త రూపం. ఆధ్యాత్మిక సాహిత్యం చేదు గుళిక లాంటిది. దాన్ని తేనెలో ముంచి తియ్యతియ్యగా మన చేతిలో పెట్టారు రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి. ఓ పట్టాన కొరుకుడు పడని విషయాల్ని ఆహ్లాదంగా చెప్పడానికి ఆయన ఎంచుకున్న పద్ధతి వైవిధ్యంగా ఉంది. ప్రతి వ్యాసాన్నీ హాస్యంతో ప్రారంభించారు. ఆ తర్వాత చక్కని శ్లోకాన్ని తాత్పర్యసహితంగా వివరించారు. విషయం సుబోధకం కావడానికి చిన్నచిన్న కథలూ, ఆసక్తికరమైన సంఘటనలూ జోడించారు. పాపపుణ్యాలు, దాన గుణం, ఇంద్రియ నిగ్రహం, మరణం, వాగ్దోషాలు… దాదాపు డెబ్భై వ్యాసాలూ ఆధ్యాత్మిక, మానసిక వికాసానికి ఉపకరించేవే. ఈ పుస్తకాన్ని కొని చదవడమే కాదు, ఆత్మీయులకు కానుకగా ఇవ్వమని రచయిత సిఫార్సు చేస్తున్నారు. మంచి సూచన.
– (ఈనాడు ఫిబ్రవరి 2011 రివ్యూ)
* * *
“అ ఆ ఇ ఈ” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి.
అ ఆ ఇ ఈ On Kinige