‘లోయ నించి శిఖరానికి‘ చేరుకోవడంలో ఎన్నో అవరోధాలూ సవాళ్లూ, వైఫల్యాలూ. అవరోధాల్ని పాఠాలుగా నేర్చుకోవాలి, సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవాలి, వైఫల్యాల్ని నిచ్చెనలుగా తీర్చిదిద్దుకోవాలి.ఆ విజయసూత్రాల్ని యండమూరి వీరేంద్రనాథ్ తన పుస్తకంలో స్ఫూర్తిదాయక శైలిలో వివరించారు. బతకడానికీ జీవించడానికీ తేడా ఏమిటో, మనిషికీ జంతువుకూ భేదం ఏమిటో, తొందరపాటుకీ సమయస్ఫూర్తికీ వ్యత్యాసం ఏమిటో నేరుగా మనసును తాకేలా వివరించారు రచయిత.
- విశాల్, ఆదివారం అనుబంధం, 21st Sep 2014.
“లోయ నించి శిఖరానికి”నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి.