కినిగె పాఠకులకు దసరా ప్రత్యేక కానుక!

Dasara Subhakankshalu_ForBlog

దసరా పర్వదినం సందర్భంగా కినిగె తన పాఠకుల కోసం ప్రత్యేక కానుకను అందిస్తోంది. కినిగెలో పుస్తకాలు కొన్న ప్రతీసారి పుస్తకం ధరను అనుసరించి పాఠకుల ఖాతాలో బోనస్ పాయింట్లు జమ అవుతుంటాయి. ఇలా వచ్చిన పాయింట్లను కనీసం 50 పాయింట్లు దాటిన తరువాత కినిగె బ్యాలెన్సుగా మార్చుకోవచ్చు, వాటితో మీకు నచ్చిన ఈ-బుక్స్ మరియు ప్రింటు బుక్స్ కొనుక్కోవచ్చు.అయితే ఈ పండుగ రోజులలో కొన్న పుస్తకాలపై మాత్రం రెట్టింపు బోనస్ పాయింట్లు లభిస్తాయి. మీ బోనస్ పాయింట్లను మీ కినిగె అక్కౌంటులోకి లాగిన్ అయ్యి ఎడమ వైపు మెనూలో ఉన్న Profile లింకుపై క్లిక్ చేసి చూడవచ్చు.
ఈ ఆఫర్ కొద్దికాలానికే పరిమితం.

Related Posts:

శ్రీ శివ మహాపురాణం ఈ-బుక్ 28% ప్రత్యేక తగ్గింపు ధరకు

కినిగె పాఠకులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు!
ఈ మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా కినిగె పాఠకులకు ప్రత్యేక కానుక అందిస్తోంది.
మహాదేవుని లీలా మాహాత్మ్యాన్ని తెలిపే శ్రీ రామకృష్ణ మఠం వారి శ్రీ శివ మహాపురాణం ఈ-బుక్‌ని 28% ప్రత్యేక తగ్గింపు ధరకే పొందండి. ఈ తగ్గింపు కొద్ది రోజులు మాత్రమే!

 శ్రీ శివ మహాపురాణం on Kinige

వేదములే మూలములుగా గల అష్టాదశ పురాణాలు ఉన్నాయి. ఆ వేదములు చతుర్ముఖ బ్రహ్మకు పరమశివుడే ఉపదేశించాడు. కనుక వేదములు, వాటి నుండి వెలువడిన శ్రుతి, స్మృతులు, పురాణాలు అన్ని ప్రప్రథమంగా శివుని చేత బ్రహ్మదేవునికి తెలుపబడింది. కాబట్టి మహాశివుడే మొట్టమొదటి పురాణ కథానాయకుడని మహాభారతం శాంతిపర్వంలో – “అష్టాదశ పురాణానాం దశభిః కథ్యతే శివః” – అని పేర్కొనబడింది. అష్టాదశ పురాణాలలో పది పురాణాలు శివుని కథలతో నిండినవని స్పష్టంగా తెలియబడుచున్నది. సర్వవ్యాపకుడు,సర్వాధారుడు, నిర్వికారుడు, నిరంజనుడు అని బ్రహ్మ విష్ణ్వాది దేవతల చేత కీర్తించదగ్గ మహాశివుని లీలా మాహాత్మ్యాన్ని తెలిపేదే ఈ శివ మహా పురాణం. ఈ శివ మహా పురాణం మహా పుణ్యప్రదాలైన పన్నెండు సంహితలను కలిగి ఉంది. లక్ష శ్లోకాలతో కూడినది. అయితే కలియుగ జీవులు అల్పాయుష్కులని గ్రహించి వ్యాసమహర్షి ఏడు సంహితలు, ఇరువది నాలుగు వేల శ్లోకాలలో సంక్షిప్తం గావించారు. ఈ శివ మహా పురాణం అష్టాదశ పురాణాలలో నాల్గవది. ఏడు సంహితలలో నాల్గవదైన కోటి రుద్ర సంహితలో ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రాదుర్భావ చరిత్ర పొందుపరచబడింది.

పురాణాలలో సాగే సంభాషణలలో ఆధ్యాత్మిక సాధకుల సాధనా మార్గాలు తేటతెల్లమవుతాయి. ఉదాహరణకు శివ మహా పురాణం రుద్ర సంహితలో దాక్షాయణి పరమశివుని సమీపించి నివృత్తి మార్గాన్ని ఉపదేశించమని కోరింది. జీవుడు ఏ తత్త్వాన్ని ఎరిగి సంసార దుఃఖాన్ని దాటగల్గుతాడో ఆ మోక్షసాధనను తెలియజేయమని కోరింది. పరమశివుడు భక్తిమార్గాన్ని బోధించి ముల్లోకాలలో భక్తి కంటె సులభమైన మార్గం లేదని వివరించాడు. ఈ పురాణంలో ప్రతీ ఘట్టం జీవులకు మేలైన సాధనా మార్గాన్ని ప్రతిపాదిస్తుంది.

“పఠనాచ్ఛ్ర శ్రవయా దస్య భక్తి మా న్నర సత్తమః, సద్యః శివపదప్రాప్తిం లభతే సర్వసాధనాత్‌” – భక్తితో శివపురాణం పఠించే మానవులూ, ఆ పురాణమును భక్తిశ్రద్ధలతో ఆలకించేవారూ, శివుని భక్తి ప్రపత్తులతో ఆరాధించే నరులు, మానవోత్తములై ఇహ లోకంనందు సుఖసౌఖ్యాలను, పరలోకమునందు శివసాన్నిధ్యాన్ని పొందగలరని ఈ పురాణమే చెబుతోంది.

Related Posts:

మిసిమి మే 2012 సంపాదకీయం

గాంధీ విద్యార్థి దశలో లండన్ లో ఉన్నప్పుడు మాథ్యూ ఆర్నాల్డ్ వ్రాసిన “లైట్ ఆఫ్ ఏషియా” గ్రంథాన్ని ఒకటికి రెండుసార్లు చదివి ఎంతో ప్రభావితుడయ్యాడు. “కార్య కారణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఏకైక ఆచార్యుడు, గౌతముడే” నని గాంధీ వక్కాణించాడు.

ఇరవైయవ శతాబ్దపు ప్రసిద్ధ విజ్ఞాన శాస్త్రవేత్త, ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కూడా బౌద్ధధర్మాన్ని “ఆధునిక శాస్త్ర విజ్ఞాన అవసరాలకు సరితూగే ధర్మం ఏదైనా ఉందంటే అది బౌద్ధమే” అని ప్రశంసించారు.

ఆధునిక జీవితంలో విజ్ఞాన పరిశోధనకు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో బౌద్ధంలో సత్యశోధనకూ అలాంటి ప్రాముఖ్యతే ఉంది. ఈ విషయానికి కాలామ సుత్త లో ఒక ఉదాహరణ: కాలాములు నివాసమున్న కేసపుత్త అనే నిగమాన్ని భగవానుడు దర్శించినపుడు కాలాములు ఆయన వద్దకు వచ్చి ఇలా అడిగారు: “భగవాన్! ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులు, శ్రమణులు ఇతరుల సిద్ధాంతాలను, విశ్వాసాలని ఎండకడుతూ, తమ ధర్మాలను ఘనమైనవిగా ఘోషిస్తున్నారు. మరొక వర్గీయులైన బ్రాహ్మణులు, శ్రమణులుకూడా వారి వారి సిద్ధాంతాల ప్రాముఖ్యతను ప్రశంసిస్తూ ఇతరుల ధర్మాన్ని నిరసిస్తున్నారు. ఈ సంఘటన మమ్ములను సంశయంతో, సంఘర్షణతో నింపివేస్తోంది. వీరిలో ఎవరు సత్యాన్ని చెబుతున్నారు, ఎవరు అసత్యాన్ని చెబుతున్నారు?”

కరుణాసముద్రుడైన భగవానుడు ఇలా అన్నాడు. “అవును కాలాములారా, మీరు లోనైన సందిగ్ధంలో ఈ సందేహం రావడం సహజమే. ఒకరు చెప్పింది కానీ, మరొకరు చేరవేసింది కానీ, సంప్రదాయంలో ఉన్నదని కాని, మీరు దేనినీ విశ్వసించి గుడ్డిగా అనుసరించకండి. మత గ్రంథాలలో పేర్కొన బడిందని, తర్కంతో లేదా సూచనల వలన, ఊహాజనిత విషయాల వలన, సాధ్యాసాధ్యాల వలన, అభిప్రాయాల వలన ప్రేరేపితులు కాకండి. కానీ, మీ విజ్ఞతతో మీరు కొన్ని విషయాలు సర్వజన సమ్మతం కావని తెలుసుకొన్నపుడు వాటిని వదిలివేయండి; మీ విజ్ఞతతో మీరు కొన్ని విషయాలు సర్వజన సమ్మతమని తెలుసుకొన్నపుడు వాటిని గ్రహించి ఆచరించండి.”

ముఖ్యంగా ఈ ప్రాథమిక అంశాల సంయోగ సహకారాల వలననే బౌద్ధం శాస్త్ర పరిశోధనకు సమాంతరస్థాయిలో ఉంటుంది. విశ్వాసం కంటే పరిశోధనా ప్రమాణాలే బౌద్ధానికి ప్రధానాంశాలు. ఈ ముఖ్యలక్షణమే బౌద్ధాన్ని ప్రపంచంలో ఇతర మతాలనుంచి భిన్నంగా ఉంచుతోంది. బౌద్ధం ఒక దైవదత్తమైన మతవిశ్వాసం కాదు. దీనికి దైవప్రోక్తమైన గ్రంథమేదీ లేదు. ఒక ప్రవక్త లేడు, అందువలన మూఢనమ్మకాలనూ, పిడివాదాన్ని ఆశ్రయించదు. వీటిపై ఆధారపడిన మతవిశ్వాసాలు, ఈనాటి సాంకేతిక సమాచార ప్రభావంతో పేకమేడల్లా కూలిపోతున్నాయి.

ఈ నేపథ్యంలో బౌద్ధం ఒక్కటే శాస్త్రవిజ్ఞానం, హేతుసంకేత పరంగానే ఉన్నదని, ఇప్పటి ప్రాచ్య, పాశ్చాత్య దేశ ప్రజలు గుర్తిస్తున్నారు. ముఖ్యంగా అక్షరాస్యత అధికంగా ఉన్న పాశ్చాత్య దేశాలలో బౌద్ధానికి గుర్తింపు ఎక్కువగా లభిస్తున్నది.

2556 బుద్ధ జయంతి సంచికలో బౌద్ధ ధర్మంలోని లోతుపాతులను పరిశీలించి చిక్కని రచనలందించిన రచయితలకు మా కృతజ్ఞతలు.

సంపాదకులు

* * *

మిసిమి మాసపత్రిక డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మిసిమి తాజా సంచిక కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

మిసిమి మే 2012 On Kinige

మిసిమి వార్షిక చందాపై రాయితీ లభిస్తోంది. ఆ వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

Misimi 2012 Subscription On Kinige

Related Posts:

మిసిమి మాసపత్రిక నవంబరు 2011- సంపాదకీయం

అర్థశతాబ్దం పాటు పత్రికలను అర్థవంతంగా నడిపి, ఎందరో రచయితలను వెలుగులోకి తెచ్చి వారికి అండగా నిలిచిన బుద్ధిజీవి ఆలపాటి రవీంద్రనాథ్. నవంబరు నాలుగు వారి జన్మదినం. చిరాయువులకు సంవత్సరాలతో పని ఏముంది? రవీంద్రనాథ్ స్మృతిగా మధురవాణితో వారి సంభాషణ, వారిని సన్నిహితంగా ఎరిగిన నరిసెట్టి ఇన్నయ్య పంపిన పరిశీలన – పత్రికా సంపాదకునిగా వారి వైదుష్యం – అందునా మిసిమి ప్రత్యేకత – ఇవి ఆలపాటి రవీంద్రనాథ్ పుట్టిన రోజు ప్రత్యేకతలు.

చరిత్రకారులు అధికారుల కథనాలతో, పాలకుల దినచర్యలతో లేదా యుద్ధాల భీభత్స్ దృశ్యాల వర్ణణతోనే పుస్తకాలను నింపారు. గ్రామ చరిత్రలు రాసిన వారు చాలా అరుదు. వీరులపాడు గ్రామ చరిత్రను వెంకటపతిరాయలు పదిహేను సంవత్సరాలు శ్రమించి గ్రంథస్తం చేశారు. వీరికి ఇప్పుడు 97 సంవత్సరాల ఆరోగ్యకరమైన వయసు. సాంఘిక చరిత్ర ఎక్కడ మొదలవుతుందో, సంస్కృతి, సంప్రదాయాలు ఎలా రూపుదిద్దుకుంటాయో మనం ఈ గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు.

జవహర్‌లాల్ నెహ్రూ ప్రజల నాయకుడు. ఆయనొక గొప్ప రచయిత కూడా. రచయిత యిక్కట్లు, ప్రచురణకర్తల వ్యాపారధోరణి ఆయన ఉత్తరంలో ఎత్తి చూపారు. అలాగే నిరాలా వంటి రచయితను ఆదుకున్న తీరు చెప్పుకోదగిందే. నవంబరు 14 ఆయన పుట్టిన రోజు.

మహిళాభ్యుదయం కోసం కృషి చేసిన మణిపూస కనుపర్తి వరలక్ష్మమ్మ. స్త్రీల హక్కుల పోరాటం కోసం మనం పాశ్చాత్య దేశాల పుస్తకాలు వెతుకుతాం. కాని మన చుట్టూ ఎందరో మహిళామణులు తమ విప్లవాలను నిశ్శబ్దంగానే నడిపారు.

తెలుగువారిలో చిత్రకారిణులను లెక్కించడానికి ఒక్క చేతివేళ్ళు కూడా ఎక్కువే. అరుదైన చిత్రకారిణి సీతాదేవి గురించిన వ్యాసం చదవండి.

మన్ జీవితం రోజూవారీ కష్టాలతో నడుస్తునే ఉంటుంది. కానీ మనిషికి అసలు భయం, రోగం – మరణం. ఇవి తప్పించుకోలేనివి. అందుకే మరణానంతర జీవితం గురించి ఊహాగానాలు చేస్తూ ఆ భ్రమలో ఈ భయాలను మర్చిపోయే ప్రయత్నం చేస్తూంటాడు. ఈ చర్చ సంజీవ్ దేవ్ ’మరణ శయ్య’ లో చదవండి.

మన తెలుగుకు ఏమయింది? మనకు అష్టదిగ్గజాలు వుండేవారు. కన్నడ భాషలో ఇప్పుడు అష్ట జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలున్నారు. ఇంత వరకు మనకున్నది ఇద్దరే. తెలుగుని ఇప్పుడున్న స్తబ్దతలో నుంచి రక్షించలేమా? మిసిమి అహరహము కృషిసల్పేది ఈ దిశగానే…

– సంపాదకులు

మిసిమి తాజా సంచికను కినిగెలోలో చదవండి.
మిసిమి నవంబరు 2011 On Kinige

మిసిమి ఈ-మాసపత్రికకు చందాదారులుగా చేరండి. వివరాలకు ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

Misimi 2011 Subscription On Kinige

Related Posts:

హ్యాపీ బర్త్ డే టూ కినిగె

ఒక వర్షం!

సంవత్సరం క్రితం, ఈ రోజే మేము కినిగెకు తొలి సాప్ట్ వేర్ కోడ్ వ్రాశాము.

ఈ సంవత్సర ప్రయాణం అద్భుతంగా ఉంది. ప్రతి క్షణాన్నీ మేము ఆస్వాదించాము.

చాలా మంది మిత్రులు, శ్రేయోభిలాషులు, అజ్ఞాత శ్రేయోభిలాషులు పలు విధాలుగా మాకు సహాయ సహకారాలందించారు. వారందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.

భవిష్యత్తు ప్రయాణాన్ని కూడా కినిగెకు, భాగస్వాములకు, మిత్రులకు, పాఠకులకు, సమాజానికి మరింత ఉపయోగకరంగా మలుస్తాము.

ఈ సందర్బంగా చిరు కానుకలు –

1. ఈ రోజు రీచార్జ్ చేసుకోని HAPPYBIRTHDAY అని కినిగె గిఫ్ట్ డబ్బాలో చెప్పండి మీరు రీచార్జే చేసుకున్న మొత్తానికి 5శాతం ఎక్కువ కినిగె బ్యాలన్స్ పొందండి.

2. మేము తెలుగు ఆల్ఫాబెట్స్ అనే చరముట్టుపై(Mobile application) పనిచేస్తున్నాము. వివరాలు ఇక్కడ. దాని ప్రివ్యూ పరిశీలించండి.

మీ సపోర్టుకు నెనర్లు. http://kinige.com దర్శించండి తెలుగు పుస్తకాలను ఆస్వాదించండి.

Related Posts:

ప్రముఖ రచయిత, జానపద, బాల సాహిత్య నిష్ణాత – డా. ఎం. హరికిషన్ పరిచయం

Dr. M. Harikishan

తెలుగు బాల ఆట పాటల పుస్తకాలు

డా.హరికిషన్ గారు 19 మే 1972 నాడు కర్నూలు జిల్లా పాణ్యంలో జన్మించారు. స్వర్గీయ ఎం. హుసేనయ్య, శ్రీమతి ఎస్. కృష్ణవేణమ్మ వీరి తల్లిదండ్రులు.

డా.హరికిషన్ గారు ‘కేతు విశ్వనాథరెడ్డి కథలు – సామాజిక దర్శనం’ అనే అంశంపై శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొంది, ప్రస్తుతం తెలుగు ఉపాధ్యాయుడుగా ఆదోనిలో పనిచేస్తున్నారు.

వీరి మొదటి కథ ‘పడగనీడ’ 1997లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైంది.అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి, పట్టుదలతో పలు జానపద కథలను వీరు సేకరించారు. అంతే కాకుండా తెలుగు బాల సాహిత్యంలో ప్రస్తుత తరానికి అందుబాటులో లేకుండా పోయిన పలు కథలను పుస్తకాలుగా వెలువరించారు. ఇంకా తెలుగు బాల బాలికల కోసం అద్భుతంగా పలు గేయాలు రచించారు.

ఇప్పటి తెలుగు బాల బాలికలు ఈ పుస్తకాలు చదివి తెలుగుకు మరింత దగ్గరగా ఉండవచ్చు.

వీరు రచించిన బాలసాహిత్యంలోని ఈ క్రింది పుస్తకాలు కినిగెలో లభిస్తాయి.

1. తేనెతీగ కందిరీగ

2. పావురం దెబ్బ

3. బొమ్మలతో సామెతలు-2

4. మెరుపుల వాన

5. బంగారు చేప – గంధర్వ కన్య

6. ఠింగురు బిళ్ళ

7. తిక్క కుదిరిన నక్క

8. నాకు మూడు నీకు రెండు

9. మూడు కోరికలు

10. రెక్కల ఎలుక

11. చందమామలో కుందేలు

12. తుంటరి చిలుక

13. గాడిద మెచ్చిన పాట

14. చేయి చేయి కలుపుదాం

15. తేనె చినుకులు

ఈ పుస్తకం ఒక్కొక్కటి విడిగా 50/- రూపాలయలకి లభిస్తుంది లేదా ఇవన్నీ కలిపి ఒక సెట్‌గా 75 రూపాలయల డిస్కౌంట్‌తో రూ. 675కే పొందవచ్చు.

ఇవే కాకుండా, డా. హరికిషన్ గారు సామాజిక సమస్యలపై 1. మాయమ్మ రాచ్చసి 2. నయాఫత్వా 3. మూడు అబద్ధాలు 4. ఒక చల్లని మేఘం 5. నేనూ మా అమ్మ అనే కథాసంపుటాలు వెలువరించారు. ‘కర్నూలు కథ’ అనే కథాసంకలనం కూడా రూపొందించారు.

హరికిషన్ గారు పిల్లల కోసం ఎన్నో పుస్తకాలు రాసారు. వీటిల్లో 1. నక్కబావ – పిల్లిబావ 2. నల్లకుక్క 3. కిర్రు కిర్రు రొడ్డప్ప 4. కుందేలు దెబ్బ 5. ఒకటి తిందునా రెండు తిందునా 6. చెప్పుకోండి చూద్దాం 7. నలుగురు మూర్ఖులు 8. పిల్లలు కాదు పిడుగులు 9. పిండిబొమ్మ వీరుడు 10. బొమ్మలతో సామెతలు -1 11. చిన్నారి గేయాలు 12. పిల్లల జానపద గేయాలు 13. చిలకముక్కు ఊడిపాయె కొన్ని. వీరు నిరంతర అధ్యయనశీలి, సాహితీ శ్రామికులు. తెలుగు పుస్తకాల కోసం అణ్వేషిస్తున్న తల్లిదండ్రులకు ఈ పుస్తకాలు ఒక ఒయాసిస్సు వంటివి.

కొల్లూరి సోమశంకర్

Related Posts:

సలీం ఈ పుస్తకాలు 30 శాతం తగ్గింపు ధరకు

సలీం, ఆధునిక తెలుగు సాహిత్యంలో పేరెన్నిక గన్న రచయిత, ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డు విజేత (2005), ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి భాషా పురష్కారం (2003) గ్రహీత. ఇతని రచనల్లో ఆరు ఇప్పుడు కినిగె పై అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా ఈ పుస్తకాలన్నీ కొనండి 30 శాతం తగ్గింపు పొందండి!!

పుస్తకాలు
1. వెండి మేఘం
2. కాంచన మృగం
3. కాలుతున్న పూలతోట
4. రాణిగారి కథలు
5. రూపాయి చెట్టు
6. ఒంటరి శరీరం

సలీం ఈ పుస్తకాలు 30 శాతం తగ్గింపు ధరకు On Kinige

Related Posts:

Mothers day special discount – 50% off on అమ్మ – అమ్మాయి – అమ్మమ్మ (ఆరోగ్యకోశం)

Happy Mothers-day.
Celebrate this mothers day by giving this wonderful book on women health care from the school of Ayurveda medicine, authored by Dr. Gayatri devi, at a special discount of 50%!
Hurry! Offer valid for only limited period

Mothers day special discount – 50% off on అమ్మ – అమ్మాయి – అమ్మమ్మ (ఆరోగ్యకోశం) On Kinige

Related Posts:

ఉగాది మహత్వ కవిత్వ సంపద

ఉగాది మహత్వ కవిత్వ సంపద On Kinige

ఉగాది అంటేనే కవిత్వం. ఉగాది కోయిలకు, మామిడి చిగురులకు, కవులకు, కవి సమ్మేళనాలకు ప్రసిద్ధి. ఈ ఉగాది పర్వదినాన మీరు ఇప్పుడు మహత్వ కవిత్వ సంపదల్లో ఓలలాడవచ్చు. నలబై శాతం పైబడి డిస్కౌంట్ తో తొమ్మిత అపురూప కవితా పుస్తకాలను మీకు ఈ ఉగాది కానుకగా కినిగె సమర్పిస్తుంది. ఈ అవకాశం కేవలం కొద్ది రోజులు మాత్రమే. ఆలసించిన ఆశాభంగం! ఒక్క నొక్కుతో తొమ్మిది కవిత్వ పుస్తకాలు కొనండి, లేదా మీ కవి మితృలకు గిఫ్ట్‌గా ఇవ్వండి.

Related Posts: