అక్షరాల నిచ్చెన… “లోయ నించి శిఖరానికి” పుస్తకం పై సమీక్ష

లోయ నించి శిఖరానికి‘ చేరుకోవడంలో ఎన్నో అవరోధాలూ సవాళ్లూ, వైఫల్యాలూ. అవరోధాల్ని పాఠాలుగా నేర్చుకోవాలి, సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవాలి, వైఫల్యాల్ని నిచ్చెనలుగా తీర్చిదిద్దుకోవాలి.ఆ విజయసూత్రాల్ని యండమూరి వీరేంద్రనాథ్ తన పుస్తకంలో స్ఫూర్తిదాయక శైలిలో వివరించారు. బతకడానికీ జీవించడానికీ తేడా ఏమిటో, మనిషికీ జంతువుకూ భేదం ఏమిటో, తొందరపాటుకీ సమయస్ఫూర్తికీ వ్యత్యాసం ఏమిటో నేరుగా మనసును తాకేలా వివరించారు రచయిత.

- విశాల్, ఆదివారం అనుబంధం, 21st Sep 2014.

LoyaNunchiSikharaniki_21Sep14

లోయ నించి శిఖరానికి”నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

లోయ నించి శిఖరానికి on kinige

 

LoyaNunchiSikharaniki600

 

Related Posts:

‘గెలుపు తీరాని’కి ఇలా..’ఎక్స్‌లెన్స్ సాధించండి’ పుస్తకంపై సమీక్ష

ఇది చదివితే నాకేమిటి ప్రయోజనం..?’ – ఇప్పుడు పాఠకుడు పుస్తకాన్ని పట్టుకునే ముందు మనసులో వేసుకునే ప్రశ్న ఇది. ‘మీ జీవితం ఎక్స్‌లెంట్‌గా ఉంటుంది’ -అని చెబుతాయి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు. ఆ కోవలోనిదే కొండా చంద్రారెడ్డి రచించిన ఎక్స్‌లెన్స్ సాధించండి… ఆశించిన ఫలితాలు సాధిస్తూ జీవితాన్ని అద్భుతం మలుచుకోండి- అనే టైటిల్‌తో వచ్చిన పుస్తకం. ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్నతిని, సుఖ సంతోషాలను కోరుకుంటాడు. వాటిని సాధించుకోవడానికి క్రమ పద్దతిలో అనుసరించాల్సిన వ్యూహం గురించి రచయిత వివరించారు. విద్యార్థులకైతే పరీక్షల్లో మంచి మార్కులు, మంచి ర్యాంకుతో మంచి కాలేజీలో సీటు, మంచి కంపెనీలో ఉద్యోగం, మంచి కేరీర్ ఇదీ నేటి యువత లక్ష్యాలు. నెగిటివ్ ఆలోచనల గురించి చక్కని విషయాలు ఉదహరించారు. ‘నేను అలా చేయకుండా ఉండాల్సింది, నా ముఖం నాకే నచ్చలేదు, ఈ పని నా వల్ల కాదు’ -అంటూ నిరంతరం నెగిటివ్ ఆలోచనల్లో మునిగి పో వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, నిజంగానే వాటిని చేయలేని స్థితికి చేరుకుంటామని, మనిషి తన ఆలోచనలకు తగినట్టుగానే ఉంటాడని రచయిత వివరించారు. విజయం సాధించడానికి, ఉన్నత స్థితికి చేరుకోవడానికి పుస్తకంలో మార్గాలు చెప్పడంతోనే సరిపుచ్చుకోలేదు. ఒకసారి చదివి పక్కన పెట్టేయకుండా ఆచరించడానికి వీలుగా పుస్తకం చివరలో అనుబంధంగా ఎక్సర్‌సైజ్ బుక్ కూడా జత చేశారు. సాధారణంగా వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లో చెప్పే అంశాలు ఒకే రకంగా ఉంటాయి. ఉదాహరణలు ఆసక్తి కలిగిస్తాయి. తాను చెప్పదలుచుకున్న అంశానికి రచయిత మంచి ఉదాహరణలు ఎంపిక చేసుకున్నారు.

-బి.ఎం, అక్షర, ఆంధ్రప్రభ, 26/07/2014

***

ఎక్స్‌లెన్స్ సాధించండి”పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

ఎక్స్‌లెన్స్ సాధించండి on kinige

Related Posts:

స్వీయ అనుభవాలు – సొంత మాటలు

జీవన కెరటాలు అనే ఈ పుస్తకం కొద్దిపాటి చదువుతో, పల్లెటూరి స్థాయి నుంచి ఎదిగి అంతర్జాతీయ స్థాయి వ్యక్తులతో కలిసి పనిచేసి జీవితాశయాలు నెరవేర్చుకున్న ఓ సామాన్యుడి అసాధారణ గాథ. ఒడిదుడుకుల జీవన గమనంలో ఎంచుకున్న రంగంలో కర్మయోగిగా పనిచేసి అనుకున్నది సాధించిన ఓ వ్యక్తి కథ ఇది. కేకలతూరి క్రిష్ణయ్య స్వీయచరిత్ర ఇది.

విద్యుద్దీకరణ అనే పెద్ద పెద్ద పదాలతో చెప్పినా, కరెంట్ స్తంభాలు పాతించడమే కదా అని తేలికగా తీసేసినా, ఆయన స్వీయ కథా స్రవంతిని చదవడం ఆసక్తికరంగా ఉంటుంది.
వృత్తిపరమైన అంశాలతో రచన ప్రారంభించి సందర్భానుసారంగా తన కుటుంబ నేపధ్యం గురించి వివరించారు రచయిత. ఈ పుస్తకం చదువుతున్నప్పుడూ ఓ జీవిత చరిత్రలా కాకుండా వ్యక్తిత్వ వికాస గ్రంథంలా అనిపించడానికి ఇదే కారణం.

క్రిష్ణయ్యగారు చిన్న పల్లెలో అత్యంత బీద కుటుంబంలో జన్మించి హైస్కూల్ స్థాయి వరకు మాత్రమే చదివి బ్రతుకుతెరువు కోసం గుమాస్తాగా, పోలీసుగా, వ్యవసాయదారుడిగా, వైద్యుడిగా, సూపర్‌వైజర్‌గా పనిచేసి, ఇంజనీర్‌గా ఎదిగి మన దేశంలోనూ, ఇతరదేశాలలోనూ అంతర్జాతీయ సలహాదారులతో పని చేసి ఇంజనీరుగా, కాంట్రాక్టర్‌గా, వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. తను స్వయంగా నేర్చుకున్న ఎన్నో అంశాలను ఎందరో కుర్రవాళ్ళకు నేర్పి వారూ జీవితంలో స్థిరపడడానికి దోహదం చేసారు. ఆయన జీవితానుభవాలు నేటి యువతకు మార్గదర్శకంగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఈ పుస్తకం ఎవరికి వారు చదువుకుని ప్రేరణ పొందవలసిందే. అయితే ఇందులోని కొన్ని అద్భుతమైన వాక్యాలను ఇక్కడ ఉటంకిస్తాను.

“ఆనందం డబ్బుతో రాదు, కావాలంటే రాదు. ఎదుటివారి ప్రేమ, ఆప్యాయత అర్థం చేసుకొని, మనం కూడా వాటిని ఇతరులకు ధారాళంగా పంచగలిగితేనే ఆనందం అందుతుంది.”

“తన గురించి, తన పరిస్థితి గురించి, బాధ్యత గురించి ఆలోచించకుండా ఇతరులను గొప్పల కోసం కొన్ని విధాలుగా సంతోషపెట్టాలనుకోవటం జీవితాన్నే దెబ్బతీస్తుంది.”

“ఎదుటి మనిషికి మేలు జరిగేపని, అప్పటికి మన గురించి చెడ్డగా అనుకున్నా పరవాలేదు, చొరవ తీసుకుని తెలియజెప్పడం మానవ ధర్మం.”

“పై మెట్టు మీద ఉన్నవాడు క్రింద మెట్లున్నాయని గుర్తుంచుకుంటే క్రిందపడడు.”

“దేవుడు మనతో కొన్ని పనులు ఎందుకు చేయిస్తాడో మనకు అర్థం కాదు. కష్టమైనా, ఇష్టం లేకపోయినా అంతా మన మంచికే అనుకుని చేసుకుపోవడమే మంచిది. కానీ అత్యాశతోనో, స్వలాభేపేక్షతోనో చేస్తే మేలు జరగకపోవచ్చు.”

“విద్య నేర్చుకున్న వ్యక్తి అయినా సమయానుకూలంగా, అప్పటి అవసరాన్ని గుర్తించి (కామన్ సెన్స్) ఆలోచించికపోతే, విజయం సాధించలేడు.”

“ఆయా అవసరమునకు తగినట్లు మన చర్య లేకపొతే మన కృషి నిరర్ధకమవుతుంది. మన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశంగా భావించాలి.”

“ఏ పని చిన్నది కాదు. చిన్న పని కదా అని అశ్రద్ధ చేయకుండా చేయడం వలన మేలు జరుగుతుంది.”

“మంచి ఉక్కు కొలిమిలో తయారు చేసి ఎంత కావాలో అంత పదును పెట్టుకోవచ్చు. ఇనుముకు ఎంత పదును పెట్టినా మండిపోతుంది. అదేవిధంగా సామర్థ్యం ఉన్న వ్యక్తి మీద వత్తిడి తెచ్చేకొద్దీ మెరుగుపడి పదును తేలుతాడు. సామర్థ్యం లేని వ్యక్తి మీద వత్తిడి తెస్తే తిరగబడతాడు.”

“మనకు ప్రాప్తం లేనప్పుడు దేవుడు కూడా ఇవ్వలేడు. ప్రాప్తం ఉన్నది ఎవరు తప్పించలేరు.”

“పని చేసేడప్పుడు ఇంకొకరి ఆలోచనలు వినకూడదనే అహంకారం ఉండకూడదు.”

“జీవితంలో సద్వినియోగం చేసుకున్న ప్రతి క్షణమూ నిన్ను కాపాడుతుంది. ”

“ప్రపంచంలో ఏ విషయమైనా, ఏ పనైనా పూర్తిగా నాకు తెలుసు అని చెప్పడానికి వీలు లేదు. ఎంత నేర్చుకున్నా, ఇంకా నేర్చుకోవలసింది ఎంతో ఉంటుంది. ”

“అత్యాశతో గాని, ఆవేశంతో గాని, స్వలాభంతోగాని తీసుకునే నిర్ణయాలు సక్రమంగా ఉండవు. మానవత్వంతో తీసుకున్న నిర్ణయం సక్రమంగా ఉంది మేలు చేస్తాయి.”

“ఒక వ్యక్తి బాధ్యత లేకుండా తిరిగేటప్పుడు ఒక లక్ష్యం, ఓర్పు, పట్టుదల ఉండవు. ఒక పధ్ధతి ఉండదు. ఏదో ఒక పని భయంతోనో, భక్తితోనో ఆరంభించి, కొన్ని పద్ధతులకు లోబడి, పని పూర్తి చేయవలననే ధ్యేయంతో, వ్యతిరేక పరిస్థితులకు తట్టుకొని నిలబడినప్పుడు ఓర్పు, సామర్థ్యం పెరుగుతుంది”

ఇలాంటి స్ఫూర్తినిచ్చే వాక్యాలు, ఉదాహరణలు ఈ పుస్తకంలో ఎన్నో ఉన్నాయి. 512 పేజీల ఈ పుస్తకం చదువరులకు ఎంతో ప్రేరణ కలిగిస్తుంది. రచయిత తన స్వీయ అనుభావాలు సొంత మాటలలో రాయడం వలన పుస్తకంలో అత్యంత నిజాయితీ కనపడుతుంది. ఆయన నిబద్ధత అర్థమవుతుంది.

జీవన కెరటాలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

జీవన కెరటాలు On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

సృష్టి సమన్వయం–క్రమశిక్షణ (Personality Development)

ప్రస్తుత విద్యా విధానం విలువల్ని పెంపొందించడంలో విఫలమైంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపకరించదు. అది పూర్తిగా వ్యక్తిని తిరోగమన మార్గంలో నడుపుతుంది. పిల్లవాడు పాఠశాలకు వెళ్ళిన ప్రారంభ దశలోనే మొదట తండ్రి బుద్దిహీనుడనీ, ఉపాద్యాయులందరూ వంచకులనీ, పవిత్ర గ్రంధాలన్నీ అసత్యాలనే నేర్చుకుంటాడు. పిల్లవాడికి 16 సంవత్సరాలు వచ్చేసరికి నిరాశావాదిగా, అచేతనుడిగా, పిరికి పందగా రూపొందుతాడు’ అన్నారు స్వామీ వివేకానంద.

నేటి సమాజంలో విజయం సాధించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ విలువలతో కూడిన వ్యక్తుల జాబితా మాత్రం వేళ్ళతో లెక్కించగల సంఖ్యకే పరిమితమైంది. అందుకే ‘విజయవంతమైన వ్యక్తిగా ఎదగడం కన్నా, విలువగల వ్యక్తిగా మారటం ముఖ్యం. విజయానికి కావలసింది కేవలం మేధ! కానీ విలువవున్న వ్యక్తిగా మారాలంటే కావలసింది-శీలం’ అంటారు ఐన్‌స్టీన్.

వ్యతిరేక భావాల్ని తరచూ వినడం వల్ల మంచి మనస్సు ఉన్నవారు కూడా మారి చెడ్డవారవుతారు. పెద్దల పట్ల వినయవిధేయతల్ని, ఉపాధ్యాయుల పట్ల గౌరవభావం కలిగి ఉండేలా, తాము నిజమని నమ్మిన దానికి ఎలాంటి పరిస్థితిలోనైనా కట్టుబడి ఉండేలా మనఃస్థైర్యాన్ని పెంపొదిస్తూ తల్లి దండ్రులు పిల్లలకు తగిన శిక్షణనివ్వాలి.

‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ అంటే ‘కన్నతల్లి, కన్ననేల స్వర్గం కంటే ఎంతో గొప్పవి’ అని శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో అంటాడు. ముందుగా ప్రతి ఒక్కరికి తల్లి, తండ్రి, గురువు, దేశం యొక్క ఉన్నత విలువల్ని తెలుసుకుని గౌరవం ఏర్పడితేనే వినయవిధేయతలు, విలువలు పాటిస్తారు.

సాక్షాత్తు ఆ భగవంతుడే మెచ్చి, ముచ్చటపడి అవతారం దాల్చిన ధన్యభూమి భారతావని. భౌతిక సుఖాలతో, భోగభాగ్యాలతో విలసిల్లుతూ ఆధునికతతో ఎంతోముందున్నాయనుకుంటున్న దేశాలు ఉనికి కూడా లేని వేల ఏళ్ళ క్రితమే, నవీన నాగరికత ఛాయలు ఉట్టిపడిన యోగభూమి మనది. గణితం నుంచి గగన ప్రయోగాల వరకు సమస్త రంగాలకు మన పరమపావన భారతావనే తొలి పాఠశాల. కాని దురదృష్టవ శాత్తూ ఈ తరం జాతి వారసత్వ వైభవాన్ని విస్మరిస్తోంది. అమ్మపెట్టిన ఆవకాయ మరచి పొరుగింటి పుల్లకూర కోసం అర్రులు చాస్తోంది.

జర్మన్ కవి, రచయిత హెర్మన్‌‌మెస్సే ‘భారతదేశం ప్రపంచపటంలోని ఒక భౌగోళిక పరమైన ఉనికి మాత్రమే కాదు. యావత్ ప్రపంచానికీ, మానవాళికీ దిశానిర్దేశం చేసిన చారత్రక వారసత్వం పుణికి పుచ్చుకున్న నేల ఇది’ అన్నారు. బహుభాషా కోవిదులు, పండితులు పీ. వీ. నరసింహారావుగారు ‘మానవ జీవన వ్యవస్థకు ప్రణాళికాబద్ధమైన విధివిధానాలను కూడా నిర్థేశించిన కర్మభూమి మనది. వ్యక్తి కర్మానుసారంగా వర్ణవ్యవస్థను రూపకల్పన చేసిన దేశం మనదే’ అన్నారు. స్వధర్మాన్ని అనుసరించడం మేలుచేస్తుంది. తమ తమ స్వభావాలకు, స్వధర్మాలకు సరిపోలని వృత్తి వ్యవహారాలతో తలమునకలై చాలామంది చేతులు కాల్చుకుంటున్నారు.

ఈ గ్రంథంలో వేదాలు, ధర్మశాస్త్రాలు, ఉపనిషత్తులు, 5000 వేల ఏళ్ళ క్రితం నుంచి భారతదేశ విశేషాలు, శాస్త్రవేత్తలు, మంత్రాలు, పునర్జన్మలు, విశ్వాంతరాళం, సృష్టి వివరాలు, మానవజన్మ, క్రమశిక్షణతో పెంచుట, క్రమశిక్షణ ఏర్పరుచుకునే విధానాల ఆధారాలతో తెలుపబడినవి. ఇది చదివినవారు మానసికంగాను, జీవితంలోని విలువలు పెంచుకుని లాభపడతారని ఆశిస్తున్నాను.

సృష్టి సమన్వయం – క్రమశిక్షణ On Kinige

Visit now http://kinige.com/kbook.php?id=188 to buy / rent the book.

Related Posts: