మొత్తం 30 కథల్ని కూర్చి ‘శాలువా‘ పేరుతో అచ్చు వేయించారు. భాష, శైలి, భావం ఈ కథల్లో పొదిగారు. కథల్ని ఉపోద్ఘాతంతో మొదలెట్టటం ఆయనకు అలవాటు. అది ఆయన ఎత్తుగడ. వస్తుపరమైన గుణవిశేషంతో పాటు శిల్పం కూడ ప్రాధాన్యం సంతరించుకుంది.
కథ రాయగానే సరికాదు. సందేశం ఉండాలి. అప్పుడే దానికి విలువ పెరుగుతుంది.
కవి, రచయిత సమాజంలోని కుళ్ళు కుతంత్రం, మూఢనమ్మకాలు, అవినీతి వంటి అంశాల మీద దృష్టి సారించి వాటి నిర్మూలనకు తమ వంతు కృషి చేయాలి. అదే చేసారు పిడుగు పాపిరెడ్డి గారు. ఒక్క మాటలో చెప్పాలంటే పిడుగుల్లాంటి కథలు పాఠకులకు అందించారు కవి. పల్లె తనాన్ని పల్లె భాషలోనే చెప్తేనే రక్తికడుతుందనడానికి ఈ కథలే తార్కాణం.
– తూములూరి రాజేంద్రప్రసాద్
చిత్ర సకుటుంబ సచిత్ర మాసపత్రిక జూలై 2013
* * *
“శాలువా” కథాసంపుటి డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ని అనుసరించండి.
శాలువా On Kinige