త్రిమూర్తితత్వం శ్రీ దత్తావతారం

మానవ జాతికి త్యాగ మహిమ, త్యాగ ఆవశ్యకత తెలియజేయడానికి దత్త స్వామి అవధూత రూపంలో అవతరించారు. దత్త అనగా ఇచ్చుట. అత్రి మహాముని కుమారుడు ఆత్రేయుడు. దత్తాత్రేయుడు శివావతారం. అత్రి మహామునికి పరమేశ్వరుడిచ్చిన వాగ్దానం ననుసరించి త్రిమూర్తులు కలిసి అత్రి కుమారునిగా జన్మించారని ఇతిహాసం.
త్రిమూర్తులు ముగ్గురు కలిసి అవతార రూపుడు కనుకనే దత్త స్వామి సమస్త సంప్రదాయాలను సమన్వయం చేసే “గురు” సంప్రదాయ ప్రవక్తుడయ్యారు.

* * *
దత్తాత్రేయునది మూడు ముఖములు, ఆరు చేతులు గల రూపం. చుట్టూ వివిధ రంగులలో నాలుగు కుక్కలు, ఒక గోవు ఉంటాయి. ఈ పరివారమంతా, ఒక చెట్టు నీడన ఉంటారు. త్రిమూర్తి తత్వానికి ప్రతీక మూడు శిరస్సులు. ఆరు చేతులలో ఢమరుకం, చక్రం, శంఖం, జపమాల, కమండలం, త్రిశూలం ధరించి ఉంటారు. అజ్ఞానంలో నిద్రిస్తున్న ఆత్మని లేపడానికి ఢమరుకుం, జీవుని కర్మబంధాలను తెంపుటకు చక్రాన్ని, ఓంకారనాదం చేయడానికి శంఖం, తన భక్తులని లెక్కించి వారి నామోచ్ఛారణ మాత్రమునే కైవల్యమొసంగుటకు జపమాల, కమండలంలో గల జ్ఞానామృతంతో జీవుని జ్ఞానతృష్ణ తీర్చి జనన మరణ శృంఖల నుండి విముక్తి కలిగించుటకు, జీవునిలో గల అహంకారాన్ని నాశనమొనరించడానికి శ్రిశూలమని, నాలుగు శునకములు నాలుగు వేదాలకి ప్రతీకలని, ఆవు కామధేనువని, ఆ వృక్షము ఔదుంబర వృక్షమని (మేడి చెట్టు) అది సర్వకామనలు తీర్చునని రహస్య సంకేతాలుగా చెబుతారు.

* * *
శైవ వైష్ణవాది మత సాంప్రదాయానుసారులు తమ తమ సాంప్రదాయానికే చెందినవాడుగా చెప్పుకున్నా, మౌలికంగా ఏకం సద్విప్రా బహుధా వదంతి అని గదా ఆర్షమత విశ్వాసం. అందువల్ల ఈ భేదాలు పట్టించుకున్న వారు లేరు, దత్తోపాసనేకే ప్రాధాన్యమిచ్చారు.

దర్శనమ్ మాసపత్రిక డిసెంబరు 2011 సంచిక నుంచి

(ఈ టపా దర్శనమ్ మాసపత్రిక డిసెంబరు 2011 సంచికలో ప్రసాదవర్మ కామఋషి వ్రాసిన “త్రిమూర్తితత్వం శ్రీ దత్తావతారం” అనే వ్యాసం యొక్క సంక్షిప్త సంగ్రహం).

వ్యాసం పూర్తి పాఠాన్ని దర్శనమ్ మాసపత్రిక డిసెంబరు 2011 సంచికలో చదవచ్చు. దర్శనమ్ మాసపత్రిక డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

దర్శనమ్
డిసెంబరు 2011 On Kinige

Related Posts: