ఆదికవి అంతరంగం  – “వందే వాల్మీకి కోకిలమ్” పుస్తకం పై సమీక్ష

‘రామాయణం తెలియనిది ఎవరికి? పూర్తిగా తెలిసినది ఎవరికి? – అర్థమైనట్టే ఉంటుంది, అర్థంకాని సూక్ష్మాలెన్నో! వాల్మీకాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలంటే వాల్మీకి మహర్షిని ఆవాహన చేసుకోవాలి .’వందే వాల్మీకికోకిలమ్‘ రచయిత కామేశ్వరరావు ప్రయత్నమూ అలాంటిదే! మిత్రుల మధ్య చర్చలా సాగుతుందీ పుస్తకం. పాత్రలకు కలిగే సందేహాలన్నీ రామాయణ పాఠకులకు తరచూ కలిగేవే! రామాయణ లక్ష్యం ఏమిటి, వాల్మీకి రామాయణంలో లేని సంఘటనలేవి, ఇతర రామాయణాల్లో ఉన్న ఘట్టాలేమిటి, భాగవతంలో శ్రీకృష్ణుని బాల్యాన్ని అత్యద్భుతంగా వర్ణించారే, మరి రామాయణం మాత్రం శ్రీరాముడి బాల్యాన్ని ఎందుకు విస్మరించింది… ఇలా ఎన్నో ప్రశ్నలకు ఇందులో జవాబు దొరుకుతుంది.

- శ్రీనివాసరావు , ఈనాడు – ఆదివారం , 26-11-2014.

Vande_EenaduSunday@26-10-2014

వందే వాల్మీకికోకిలమ్” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

వందే వాల్మీకికోకిలమ్ on kinige

 

VandeValmikiKokilam600

Related Posts:

“సాకేత రామాయణం” పై డా. పుల్లెల శ్రీరామచంద్రుడు అభిప్రాయం

“శ్రీ గజానన్ తామన్ గారికి

నమస్కారములు.

మీరు సౌహార్దముతో పంపిన సాకేతరామాయణం చదివి ఆనందించుచున్నాను. కావ్యం అంతా మృదుమధుర శైలిలో చక్కగ నడచినది. ఈ కావ్యంలోని సౌందర్యాన్ని ప్రొ. లక్ష్మణమూర్తిగారు, డా. గండ్ర లక్ష్మణరావుగారు చక్కగా విశదీకరించినారు. శ్రీ సువర్ణ లక్ష్మణ్ రావుగారు శ్రీ సీతారామసేవా సదనం ద్వారా ప్రచురించి సాహితీప్రియులకు ఉత్తమమైన భక్తిరసప్లుమైన కావ్యం అందజేసినారు.

సాకేత రామునికి ఒక్క లక్ష్మణుని సేవ అందితే సాకేత రామాయణానికి ముగ్గురు లక్ష్మణుల సేవ అందినది.

అభినందనములతో

భవదీయుడు
పుల్లెల శ్రీరామచంద్రుడు.”

* * *

శ్రీ గజానన్ తామన్ రచించిన “సాకేత రామాయణం”డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.

సాకేత రామాయణం On Kinige

Related Posts:

“సాకేత రామాయణం” పై డా. సి. నారాయణ రెడ్డి అభిప్రాయం

“శ్రీ గజానన్ తామన్ గారికి
సమస్కారం.

మీరు ఆప్యాయంగా పంపిన మీ గేయ కావ్యం “సాకేతరామాయణం” అందింది. సంతోషం.

మరాఠీ మహాకవి మాడ్గూళ్కర్ “గీత్ రామాయణ్” కు మీరు చేసిన తెలుగు అనుసృజనం పరమ మౌలికంగా ఉంది.

గేయ చ్ఛందస్సులో వివిధ గతుల్లో ఈ కావ్యాన్ని రూపొందించారు మీరు. భావాలు మూలగ్రంధంలోనివే అయినా వాటిని తెలుగు పదాల్లో మీరు పొదిగిన తీరు శ్లాఘనీయంగా ఉంది.

చక్కని పరిణత కృతిని తెలుగులో అందించిన మీకు నా హార్దికాభినందన.
డా. సి. నారాయణరెడ్డి”

* * *

శ్రీ గజానన్ తమన్ రచించిన “సాకేత రామాయణం”డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.

సాకేత రామాయణం On Kinige

Related Posts: