‘తత్వశాస్త్రం, చిన్న పరిచయం’ పుస్తకంపై సమీక్ష

మార్క్సిస్టు దృక్పథంతో కలం పట్టిన రచయిత్రి రంగనాయకమ్మగారు. ఆమె తాజా పుస్తకం ‘తత్వశాస్త్రం, చిన్న పరిచయం‘. ఎవరికీ అర్థంకాని ఓ జటిల శాస్త్రాన్ని తేలికపాటి చిన్న పదాల్లో అతి సామాన్య ప్రజలకు ఈ పుస్తకం ద్వారా చేరువ చేశారు.
ప్రకృతినీ, సమాజాన్నీ అర్థం చేసుకోవాలనే జిజ్ఞాసతో ప్రారంభమైన శాస్త్రమిది. మార్క్స్, ఏంగెల్స్ లను ప్రభావితం చేసినవాడు హెగెల్. “అభివృద్ధి అనేది నిరంతరం ముందుకు వెళుతూ ఉంటుంది. ఏదీ స్థిరంగా ఉండదు. సమాజం మారిపోతూ ఉంటుంది. అభివృద్ధి జరిగిపోతూ ఉంటుంది”. అంటూ హెగెల్ చెప్పిన మాటలు మార్క్స్‌ను ముగ్ధుణ్ణి చేశాయి. శ్రమ దోపిడీ రహస్యాన్ని బైటకు లాగిన సిద్ధాంతం మార్క్సు సిద్ధాంతం. మార్క్స్ తన సిద్ధాంతంలో తర్క విచారణ కోసం మాత్రమే హెగెల్‌ను పేర్కొన్నాడు. క్రీస్తుపూర్వం నాటి తత్వవేత్తలు, ఆధునిక తత్వవేత్తలు, మానవ చరిత్ర, చారిత్రక భౌతికవాదం వంటి ఇందులోని 48 శీర్షికలు ఎంతో ఆసక్తితో మనల్ని చదివింపజేస్తాయి.
‘ఆడవాళ్ళు ఎంత చక్కటి భౌతికవాదులు!’ అంటారీమె. కమ్యూనిజం తర్వాత ఏమిటి? అని ప్రశ్నిస్తారు. తత్వశాస్త్రం ఉంటే మంచిదే. లేకపోతే మరీ మంచిది అంటారు. మార్క్స్ ఏంగెల్స్‌లను ముగ్ధుల్ని చేసిన ఇద్దరు తత్వవేత్తలు ఎవరో వివరిస్తారిందు లో. పుల్లయ్య, ఎల్లయ్య కాలక్షేపం తత్వాలు ఎలా ఉంటాయో కూడా ఈ పుస్తకంలో ఆమె వివరిస్తారు.
శ్రామిక వర్గ పోరాటాన్ని ఒప్పుకోని ప్రాధాన్(దారిద్ర్యం తత్వశాస్త్రం రచయిత) పై మార్క్స్ చేసిన విమర్శలు వంటి అంశాలను హాయిగా ఇందులో చదువుకోవచ్చు.

–నవ్య, 28th May 2014

 

 

 

 

 

 

 

 

తత్వశాస్త్రం, చిన్న పరిచయం”నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

***

తత్వశస్త్రం, చిన్న పరిచయం on kinige

Related Posts: