కంచికి వెళ్లని కథలు! – “కథ-2013″ పుస్తకంపై సమీక్ష

ఇటీవలి కాలంలో రెండు గొప్ప ప్రయత్నాల్ని గమనిస్తాం – కవితా వార్షిక, కథా వార్షిక ప్రచురణలు. 2013లో వెలువడిన అనేక కథల్ని చదివి, అనేక కోణాలలో పరిశీలించి – వాటిలో సంపాదకులు ఎంపిక చేసిన పద్నాలుగు రచనల్ని ‘కథ-2013‘గా ప్రచురించారు. కార్పొరేట్ వ్యవస్థ, ప్రచార మాధ్యమాల మోజు, కనుమరుగవుతున్న పల్లెల స్వచ్ఛత, మనసు పొరల విచిత్రాలు, ఉద్యోగ జీవితాల్లోని స్థితిగతులు తదితర సమకాలీన వస్తువులతో మనసును స్పందింపచేసే కథలివి. పతంజలిశాస్త్రి ‘రామేశ్వరం కాకులు’ పాఠకుడ్ని అస్థిమితపరుస్తుంది. కిడ్నీలు అమ్ముకునే స్వేచ్ఛ ఉండాలంటూ మనసును ఆర్ద్రం చేస్తారు పెద్దింటి అశోక్‌కుమార్ ‘ప్రాణం ఖరీదు వంద ఒంటెలు’ కథలో. సునీల్‌కుమార్ ‘దెయ్యం’ ఉత్కంఠ భరితంగా సాగుతూనే మానవ సంబంధాల పతనాన్ని వెల్లడిస్తుంది. ‘కథ 2013‘లో ప్రసిద్ధులతోపాటూ ఈతరం కథకులూ ఉన్నారు.

–డా. ద్వా.నా.శాస్త్రి, 13 జూలై 2014, ఆదివారం అనుబంధం

 

 

 

 

 

 

 

 

కథ-2013” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

***

కథ-2013 on kinige

Related Posts:

విలక్షణమైన కథలు – “ఇరులదొడ్డి బతుకులు” పుస్తకంపై సమీక్ష

తమిళనాడులోని హోసూరు నగరానికి నాలుగైదు ఆమడల దూరంలో అడవుల మధ్య ఉండే పల్లెటూరు ఇరులదొడ్డి. నాలుగైదు దశాబ్దాల క్రితంనాటి పల్లెల్నీ అమాయక ప్రజల ఆలోచనల్నీ జీవన విధానాన్నీ బతుకు పోరాటాన్నీ ఈ కథల్లో పూసగుచ్చినట్టు చెప్పారు రచయిత నారాయణరెడ్డి. పన్లోపనిగా వివిధ వృత్తుల్నీ పలకరించారు, శ్రామికుల్నీ పరామర్శించారు. ‘నాయకురాలు నాగవ్వ’, ‘కన్నతల్లి లాంటి కస్తూరావు’, ‘బీముని మింగిన రాముడు’ … ఈ కథల్లో మనకు తారసపడే పాత్రలు. పాత్రలంటే మనుషులే కానక్కర్లేదు – పశువులూ చెట్లూ చేమలూ కావచ్చు. ఒకప్పుడు అవిభక్త మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న… హోసూరు ప్రాంతంలోని తెలుగు మాండలిక సౌందర్యం ఈ కథలకు ప్రాణమై నిలిచింది.

-నందన్‌, ఆదివారం అనుబంధం, 23rd Feb 2014

ఈ ఆర్టికల్‌ని ఈనాడు పుస్తకం పేజీలో చదవడం కొరకు ఈ క్రింద లింక్ క్లిక్ చేయండి:

http://archives.eenadu.net/02-23-2014/Magzines/Sundayspecialinner.aspx?qry=pustaka

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఇరులదొడ్డి బతుకులు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింద లింక్‌ని అనుసరించండి.

***

ఇరులదొడ్డి బతుకులు on kinige

Related Posts:

నడుస్తున్న చరిత్ర నవంబర్ 2012 సంపాదకీయం

నడుస్తున్న చరిత్ర నవంబర్ 2012 సంపాదకీయం

EditorialNadustunnaCharitraNov2012

* * *

నడుస్తున్న చరిత్ర మాసపత్రిక డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. తాజా సంచిక కోసం ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

నడుస్తున్న చరిత్ర నవంబరు 2012 On Kinige

Related Posts:

ప్రభుత్వం స్పష్టమైన ప్రకటనతో ముందుకురావాలి

నడుస్తున్న చరిత్ర అక్టోబరు 2012 సంపాదకీయం

Nadustunna Charitra Oct 2012 Editorial

* * *

నడుస్తున్న చరిత్ర అక్టోబరు 2012 On Kinige

Related Posts:

నడుస్తున్న చరిత్ర ఆగస్టు 2012 సంచిక – సంపాదకీయం

నడుస్తున్న చరిత్ర ఆగస్టు 2012 సంచిక – సంపాదకీయం

Nadustunna Charitra August 2012 Editorial

* * *

నడుస్తున్న చరిత్ర ఆగస్టు 2012 On Kinige

Related Posts:

నడుస్తున్న చరిత్ర జూన్ 2012 సంపాదకీయం

వారసత్వ కమీషన్‍ను వెంటనే ఏర్పరచాలి.

Nadustunna Charitra June 2012 Editorial

నడుస్తున్న చరిత్ర జూన్ 2012 On Kinige

Related Posts: