సుప్రసిద్ధ రచయిత్రి శ్రీవల్లీ రాధిక గారి కవితా సంకలనం “కైవల్యం“పై కౌముది అంతర్జాల మాసపత్రిక, ఫిబ్రవరి 2012లో సమీక్ష ప్రచురితమైంది.
అర్ధవంతమైన కవితలు, అర్ధమయ్యే కవితలు, ఆలోచించి వ్రాసిన కవితలు, ఆలోచింపజేసే కవితలు…వ్రాసే అతికొద్ది మంది ఆధునిక కవయిత్రులలో రాధికగారు ఒకరని సమీక్షకులు అభిప్రాయం వ్యక్తం చేసారు. ఈ సంకలనంలోని కవితల్లో చాలా భాగం వాస్తవ చిత్రణతో మొదలై ఆధ్యాత్మిక భావనలను అల్లుకుని ఒక చక్కని ముగింపుతో పూర్తవుతుందని; ఏ కవితా అలవోకగా చదివి మరిచిపోయేది కాదని సమీక్షకులు పేర్కొన్నారు. పుస్తకానికి ముందుమాట వ్రాసిన అద్దేపల్లి రామ్మోహనరావుగారి మాటలు, చివరి అట్టపై ఆశీస్సులందించిన సామవేదం షణ్ముఖశర్మగారి మాటలు అక్షరసత్యాలని సమీక్షలులు పేర్కొన్నారు.
పూర్తి సమీక్షకై ఈ లింక్ నొక్కండి
కైవల్యం కవితాసంపుటి డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి.
కొల్లూరి సోమ శంకర్