సుప్రసిద్ధ నవలా రచయిత మధుబాబు కలం నుంచి వెలువడిన షాడో ఎడ్వంచర్ ట్రబుల్ మేకర్స్.
కులకర్ణి సి. ఐ. బి చీఫ్‌గా రిటైరయ్యే సమయం దగ్గర పడుతూంటూంది. ఆయన స్థానంలో షాడోని నియమించాలని బిగ్ బాస్‌లు తలుస్తారు. షాడోకి అన్ని అర్హతలున్నా, నావీ గురించి అతనికి తెలిసింది తక్కువ కాబట్టి ఐ. ఎన్. ఎస్. కావేరిలో అప్రెంటిస్‌షిప్ చేయాల్సిందిగా ఆదేశిస్తారు. మొదట్లో కొద్దిగా వ్యతిరేకించినా, చివరికి కావేరిలో అప్రెంటిస్‌గా చేరుతాడు.
షిప్లో తెలుసుకోవాలసినవన్నీ తెలుసుకుని, తన పనితీరుతోనూ, చురుకుదనంతోనూ స్పెషల్ కన్సిడరేషన్ మీద వైస్ కాప్టెన్‌గా ప్రమోట్ అయ్యాడు. సిబ్బంది, ప్రయాణీకుల ఆదరణనీ, అభిమానాన్ని పొందుతాడు.
ఇలా ఉండగా, దక్షిణాఫ్రికాలోని కల్హారీ రేవులో కావేరీని అధికారులు చాలా సేపు ఉంచేస్తారు. కల్హారీ లేబొరేటరీలోంచి ఓ సూపర్ బాంబ్ మాయమైంది, ఆ బాంబుని పేల్చడం తెలిసిన మోర్గాన్ అనే సైంటిస్ట్‌ని దేశద్రోహులు అపహరించారట. వారిని వెదకడం కోసం రేవులోని అన్ని నౌకలను మిలిటరీ అధికారులు వెదుకుతూ, కావేరి ప్రయాణాన్ని వాయిదా వేయిస్తారు. ఓడని ఆమూలాగ్రం పరీక్షిస్తారు. చివరికి ప్రయాణం కొనసాగించడానికి అనుమతినిస్తారు.
ఉన్నట్లుండి నౌకలోని సిబ్బంది కొంతమంది హత్యకి గురవుతారు, మరికొందరు కనపడకుండాపోతారు. నౌక ప్రయాణించాల్సిన మార్గం కాకుండా మరో మార్గంలోకి వెళ్ళిపోయి, కొండరాళ్ళని ఢీకొట్టే ప్రమాదాన్ని తృటిలో తప్పించుకుంటుంది.
షిప్లో ఏదో జరుగుతోంది? కనపడి మాయమవుతుతున్న కొత్త వ్యక్తులు ఎవరు? సిబ్బంది హత్యల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? షాడో దాన్నెలా ఛేదించాడు?
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే ఈ రోమాంచక నవల చదవాల్సిందే.
చివరిదాక ఆసక్తిగా సాగిపోయే ఈ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి
కొల్లూరి సోమ శంకర్