“కలర్స్ ఆఫ్ ఇండియా”

ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ రూపొందించిన “కలర్స్ ఆఫ్ ఇండియా” పుస్తకాన్ని సీనియర్ పాత్రికేయులు కె.శ్రీనివాస్, డెక్కన్ క్రానికల్ కార్టూనిస్ట్ సుభానిలు 31 జులై 2011 నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆవిష్కరించారు.

ఈ పుస్తకంలో శేఖర్ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, ప్రకృతి సౌందర్యాలను కార్టూన్ల ద్వారా పొందుపరిచారు.

ఈ కార్యక్రమంలో నవ్య ఎడిటర్ జగన్నాథశర్మ, చలకాని వెంకన్న, ముక్కమూల వెంకన్న, కార్టూనిస్ట్ మోహన్ పాల్గొన్నారు.

అయితే ఈ పుస్తకం గత నెలలోనే అమెరికాలో ఆవిష్కరించబడింది.

రాజకీయ కార్టూన్లపై అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ స్టాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్‌షిప్ ప్రాజెక్టుకు మన దేశం నుంచి ఎంపికైన ముగ్గురు కార్టూనిస్టులలో శేఖర్ ఒకరు. ఈ సమావేశం జూన్ నెలలో వాషింగ్‌టన్ డి.సి లో నిర్వహించబడింది.

తన అమెరికా ప్రయాణం సందర్భంగా శేఖర్ తనపై తానే వేసుకున్న కార్టూన్ ఇది.

ఈ సందర్భంగా శేఖర్ ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధులైన ఎందరో కార్టూనిస్టులను కలిసి తన అనుభవాలను పంచుకున్నారు.

ఆమెరికన్ ఎడిటోరియల్ కార్టూనిస్టుల కన్వెన్షన్ ఫోటో ఇది.

వాషింగ్‌టన్ పోస్ట్ కార్టూనిస్ట్ యాన్ టెల్‌నేస్ తో శేఖర్

జెర్రీ బాట్‌మన్ రాబిన్‌సన్‍‌తో శేఖర్

ఎం. ఎస్. ఎన్. బి. సి కి చెందిన డరిల్ కేగల్‌తో శేఖర్

జెఫ్ పార్కర్ తో శేఖర్

ధైర్యవంతుడైన కార్టూనిస్ట్ అవార్డు పొందిన మలేసియన్ కార్టూనిస్ట్ జునార్‌తో శేఖర్

పులిట్జర్ బహుమతి విజేత రమిరెజ్ తో శేఖర్

అమెరికా బడి పిల్లలలతో శేఖర్

శేఖర్ యొక్క ఈ కలర్స్ ఆఫ్ ఇండియా పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల రూ. 90/- దీనిని నెలకు 30/-తో అద్దెకి తీసుకుని చదువుకోవచ్చు.

Colors Of India On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts: