ఉత్తరాంధ్రలో… దోపిడీ ఉంది, తిరుగుబాటు తత్వమూ ఉంది. కష్టాలున్నాయి, గుండెధైర్యమూ ఉంది. నిరక్షరాస్యత ఉంది, గొప్ప సాహిత్యమూ ఉంది. మూడున్నర దశాబ్దాల అట్టాడ అప్పల్నాయుడు సాహిత్యం ఆ వైవిధ్యానికి అద్దంపడుతుంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో వస్తున్న సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల్ని ఓ రచయితగా ఆయనంత లోతుగా మరొకరు అర్థంచేసుకుని ఉండకపోవచ్చు. మహోగ్రంగా సాగిన శ్రీకాకుళం రైతాంగ పోరాటాన్నీ, తదనంతర పరిణామాల్నీ తన రచనల్లో కళ్లకు కట్టారు. న్యాయ వ్యవస్థనీ రాజ్య వ్యవస్థనీ కడిగిపారేశారు. ఆ శైలిలో యాసా, సామెతా, చమత్కారం గుబాళిస్తాయి. శ్రీకాకుళ సాహితి, మిత్ర సాహితి, స్నేహ కళా సాహితి… ఆయన సమగ్ర సాహిత్యాన్ని మూడు సంపుటాల్లో అందిస్తున్నాయి.
-శ్రీనిధి, ఆదివారం అనుబంధం, 19th Jan 2014
ఈ ఆర్టికల్ని ఈనాడు పుస్తకం పేజీలో చదవడం కొరకు ఈ క్రింద లింక్ క్లిక్ చేయండి
http://archives.eenadu.net/01-19-2014/Magzines/Sundayspecialinner.aspx?qry=pustaka
“అట్టాడ అప్పల్నాయుడు సాహిత్యం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింక్ని అనుసరించండి.
***
అట్టాడ అప్పల్నాయుడు సాహిత్యం-1 on Kinige