జీబూ … జీబూ …. జీబూ ….

చెట్ల కొమ్మల మీద ప్రయాణంచేస్తూ షాడోను అనుసరించి వచ్చిన అటవికులు అందరూ ఒకే చెట్టుమీద సమావేశమైనారు. అరనిమిషం, ఒకటి….రెండుమూడు నిముషాలు గడిచినా షాడో బయటికి రాకపోవటం వారిలో కొందరికి విపరీతమైన ఆశ్చర్యాన్ని కలిగించింది.

“ఇంతసేపు నీటిలో వుంటే ప్రాణాలుపోతాయి. చచ్చిపోయాడంటావా?” తల బరుక్కుంటూ తన అనుమానాన్ని వెల్లడించేశాడు ఒక అటవికుడు.

లాగిపెట్టి అతని నెత్తిమీద కొట్టాడు మరొకడు.

“చవట ముఖమా! మట్లాడకుండా చూడు… ఏమాత్రం శబ్దంచేసినా మనందరి ప్రాణాలు ఎగిరిపోతాయి. మనవ రూపంలో అరణ్య సంచారానికి వచ్చాడు జీబూ. అతని ఏకాంతానికి భంగం కలిగింది. సర్వనాశనం అయ్యారు గోరీ జాతి గుంపు. సద్దుచేస్తే మనకు కూడా అటువంటి గతే పడుతుంది” అని హెచ్చరించాడు లోగొంతుకతో.

జరిగిన సంఘటనలను నెమరు వేసుకుంటున్నకొద్దీ వారిలో తమ ఎదుట ఉన్నది జీబూ అనే నమ్మకం విపరీతంగా బలపడసాగింది.

“దేవతలందరిలోను జీబూను మించిన అందగాళ్ళు మరిఎవ్వరూ లేరు. మనవ రూపం ధరించి అరణ్యంలోసంచారం చేయడం జీబూకు ఒక వేడుక” జలప్రవాహం వంకే చూస్తూ మెల్లిగా అన్నాడు వృద్ధ అటవికుడు ఒకడు.

వృద్ధ అటవికుడి మాటలువిని భయభక్తులతో తలలు ఆడించారు మిగిలినవారందరూ. “పొదల మీదినుంచి ఎగిరి గంతు వేస్తూ బయలుదేరిన జీబూను చూసి దూరంగా తప్పుకొన్నాయి ఆడవి జంతువులన్నీ, మనిషిని చూస్తే మీదపడి రక్తాన్ని రుచి చూస్తే పెద్దపులి సైతం జీబూను చూసి తోక ముడిచింది. దానిమీద నుంచి ఎగిరి అవతలకు దూకాడు జీబూ, తనను చూసి గర్జించిందని ఆగ్రహం చెందలేదు. నిజమే! జీబూకు కోపం ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో చెప్పటం చాలా కష్టం!!”

కంపిస్తున్న కరచరణాలతో వూపిర్లు బిగపట్టి, జల ప్రవాహం వంకే చూస్తూ కూర్చున్నారు వారందరూ.

 

To read this eBook click now at http://kinige.com/kbook.php?id=1074

Related Posts:

ట్రబుల్ మేకర్స్

సుప్రసిద్ధ నవలా రచయిత మధుబాబు కలం నుంచి వెలువడిన షాడో ఎడ్వంచర్ ట్రబుల్ మేకర్స్.

కులకర్ణి సి. ఐ. బి చీఫ్‍గా రిటైరయ్యే సమయం దగ్గర పడుతూంటూంది. ఆయన స్థానంలో షాడోని నియమించాలని బిగ్ బాస్‌లు తలుస్తారు. షాడోకి అన్ని అర్హతలున్నా, నావీ గురించి అతనికి తెలిసింది తక్కువ కాబట్టి ఐ. ఎన్. ఎస్. కావేరిలో అప్రెంటిస్‌షిప్ చేయాల్సిందిగా ఆదేశిస్తారు. మొదట్లో కొద్దిగా వ్యతిరేకించినా, చివరికి కావేరిలో అప్రెంటిస్‌గా చేరుతాడు.

షిప్‌లో తెలుసుకోవాలసినవన్నీ తెలుసుకుని, తన పనితీరుతోనూ, చురుకుదనంతోనూ స్పెషల్ కన్సిడరేషన్ మీద వైస్ కాప్టెన్‌గా ప్రమోట్ అయ్యాడు. సిబ్బంది, ప్రయాణీకుల ఆదరణనీ, అభిమానాన్ని పొందుతాడు.

ఇలా ఉండగా, దక్షిణాఫ్రికాలోని కల్హారీ రేవులో కావేరీని అధికారులు చాలా సేపు ఉంచేస్తారు. కల్హారీ లేబొరేటరీలోంచి ఓ సూపర్ బాంబ్ మాయమైంది, ఆ బాంబుని పేల్చడం తెలిసిన మోర్గాన్ అనే సైంటిస్ట్‌ని దేశద్రోహులు అపహరించారట. వారిని వెదకడం కోసం రేవులోని అన్ని నౌకలను మిలిటరీ అధికారులు వెదుకుతూ, కావేరి ప్రయాణాన్ని వాయిదా వేయిస్తారు. ఓడని ఆమూలాగ్రం పరీక్షిస్తారు. చివరికి ప్రయాణం కొనసాగించడానికి అనుమతినిస్తారు.

ఉన్నట్లుండి నౌకలోని సిబ్బంది కొంతమంది హత్యకి గురవుతారు, మరికొందరు కనపడకుండాపోతారు. నౌక ప్రయాణించాల్సిన మార్గం కాకుండా మరో మార్గంలోకి వెళ్ళిపోయి, కొండరాళ్ళని ఢీకొట్టే ప్రమాదాన్ని తృటిలో తప్పించుకుంటుంది.

షిప్‌లో ఏదో జరుగుతోంది? కనపడి మాయమవుతుతున్న కొత్త వ్యక్తులు ఎవరు? సిబ్బంది హత్యల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? షాడో దాన్నెలా ఛేదించాడు?

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే ఈ రోమాంచక నవల చదవాల్సిందే.

చివరిదాక ఆసక్తిగా సాగిపోయే ఈ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి

ట్రబుల్ మేకర్స్ On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

నెవర్ లవ్ ఎ స్పై

ప్రముఖ డిటెక్టివ్ నవలా రచయిత మధుబాబు కలం నుంచి జాలు వారిన మరో సస్పెన్స్ థ్రిల్లర్ నెవర్ లవ్ ఎ స్పై.

నవల షాడో బిందుల పెళ్ళితో ప్రారంభమవుతుంది. పెళ్ళికి షాడోకి కావల్సిన వాళ్ళంతా వస్తారు, పెళ్లి ఘనంగా జరుగుతుంది. కొత్త దంపతులు హనీమూన్‌కి నేపాల్ వెడతారు. రెండు నెలలు సెలవిచ్చిన కులకర్ణి, నేపాల్ విడిచి ఎక్కడికీ వెళ్ళద్దని షాడోని హెచ్చరిస్తారు. ఆనందంగా కాలం గడుపుతున్న షాడోకు రామతీర్ధ నుంచి ఓ ఉత్తరం అందుతుంది. వెంటనే వచ్చి తనని కలుసుకోమని రాస్తాడు రామతీర్ధ.

భారతదేశం నుంచి పారిపోయివచ్చిన సైంటిస్ట్ జనార్ధన్ వివరాలు చెప్పాలని పిలిచిన రామతీర్ధ, ఆ వివరాలేమీ చెప్పకుండానే దుండగులు దాడిలో చనిపోతాడు. హనీమూన్ సంగతి పక్కకి పెట్టి బిందూ, షాడోలు జనార్ధన్ జాడకోసం రంగంలోకి దిగుతారు. ఎన్నో సాహసకృత్యాలు చేస్తారు, ఎన్నో ప్రమాదాలను ఎదుర్కుంటారు.

సైంటిస్ట్ జనార్ధన్‍ని ఎవరు, ఎందుకు అపహరించారు? ఏమాశించి జనార్ధన్ భారతదేశాన్ని విడిచాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే ఈ రోమాంచక నవల చదవాల్సిందే.

ఈ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి

నెవర్ లవ్ ఎ స్పై On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

బ్లడ్ హౌండ్

సుప్రసిద్ధ రచయిత మధుబాబు రచించిన మరో థ్రిల్లర్ బ్లడ్ హౌండ్.

స్వాతంత్ర్యానంతరం, అత్యంత కిరాతకులుగా పేరుపొందిన మిజో జాతి ఆటవికులను నయనాభయానా లొంగదీసుకుని వారిని మిజో రిజర్వేషన్ పరిధిలో ఉంచింది ప్రభుత్వం. కానీ కొన్నేళ్ళకు ఆ తెగవారు మళ్ళీ ఆయుధాలు ధరించి జనాలను ఊచకోత కోయసాగారు. కారణాలు తెలుసుకుందామని వెళ్ళిన మిలిటరీ అధికారులపై సైతం దాడి జరిగింది. దేశద్రోహులెవరో వారిని ఎగదోస్తున్నారని ఆర్మీ అధికారులు గ్రహించారు. ఆటవికులకి మద్యం అలవాటు చేసి వారితో ఎవరో నాగరికులే దాడులు చేయిస్తున్నారని తెలుస్తుంది.

ఆ పరిసరాల్లో ఉన్న షాడో పరిస్థితి తీవ్రత గ్రహించి ఆర్మీ అధికారులను హెచ్చరిస్తాడు. అక్కడ్నించి బయల్దేరి వచ్చేస్తుండగా, మిజో జాతీయులు మరో మారణకాండ కొనసాగించడంతో, షాడో జోక్యం కలిగించుకోవాల్సి వస్తుంది. “వందమంది దుండగులను పట్టుకోవడానికి ఒక బెటాలియన్ సైన్యాన్ని పంపిస్తే అందరూ వెక్కిరించరా? మిజో జాతి కళ్ళలో మనం చులకనై పోమా?” అని ఆర్మీ అధికారులు సంశయిస్తుంటే, షాడో రంగంలోకి దిగక తప్పదు.

మిజో జాతి గెరిల్లాల వెనుక ఉన్న నాగరీకుడు ఎవరు? ఆటవికులను ఎగదోయడంలో రహస్యమేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు ఈ రోమాంచక నవలలో లభిస్తాయి.

ఆసాంతం ఆసక్తిగా సాగిపోయే ఈ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్‍ను అనుసరించండి.

బ్లడ్ హౌండ్ On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

కమాండర్ షాడో

ప్రఖ్యాత డిటెక్టివ్ నవలల రచయిత మధుబాబు కలం నుంచి జాలువారిన మరో థ్రిల్లర్ నవల “కమాండర్ షాడో“.

మన దేశంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన నది బ్రహ్మపుత్రానది. ప్రతీ ఏడాదీ ఈ నదికి వచ్చే వరదల వల్ల వేలాది మంది మృత్యువాత పడుతూంటారు. ఎన్నో వేల ఎకరాల పంట నాశనం అవుతుంటూంది. దీనికి విరుగుడుగా బ్రహ్మపుత్రానదిపై ఆనకట్ట నిర్మించాలని తలపోస్తుంది ప్రభుత్వం. అయితే నదీ పరివాహక ప్రాంతమంతా దట్టమైన అటవీప్రాంతం కావడం వల్ల, ఆనకట్టకి సరైన స్థలాన్ని అన్వేషించడానికి ఆర్మీ అధికారులను పంపుతుంది. కల్నల్ రాంప్రసాద్ నాయకత్వంలో వెళ్ళిన బృందం మాయమవుతుంది. వారిని వెదుకుతూ వెళ్ళిన కమాండర్ త్రిపాఠీ నాయకత్వంలోని మరో బృందం ఆచూకీ తెలియకుండాపోయింది. బ్రహ్మపుత్రానది వారిని మింగేసిందా? లేక ఆ ప్రాంతాల్లో తలదాచుకునే బందిపోట్లు వారిని హతమార్చారో ఎవరికి తెలియలేదు.

చివరకి ప్రధానమంత్రి ఈ రెండు బృందాలను సంరక్షించే బాధ్యతని షాడోపై ఉంచారు. మిలిటరీ నుంచి కాప్టెన్ హిమానీ అనే ఇంజనీరు కూడా బయల్దేరాడు.

మిలిటరీ అధికారులు ఏమాయ్యారు? చనిపోయాడని అందరూ భావించిన బందిపోటు దొంగ బేలూ సింగ్ బతికే ఉన్నాడా? మిలిటరీ అధికారులు సైతం నెగ్గుకురాలేని చోట షాడో ఎలా విజయం సాధించాడు? షాడోకి ఎవరెవరు సాయం చేసారు? షాడో బందిపోట్ల ఆటలను ఎలా కట్టించాడు?

ఈ ప్రశ్నలకి సమాధానాలు కావాలంటే ఈ రోమాంచక నవల చదవాల్సిందే. ఆసక్తిగా సాగిపోయే కథనం పాఠకులని కట్టిపడేస్తుంది.

ఈ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈక్రింది లింక్ నొక్కండి

కమాండర్ షాడో On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

సి. ఐ. డి. షాడో

ప్రముఖ డిటెక్టివ్ రచయిత మధుబాబు వ్రాసిన రొమాంఛిత సస్పెన్స్ థ్రిల్లర్ “సి. ఐ. డి. షాడో”

ఓ రోజు కులకర్ణి షాడోని పిలిచి, “రాజూ, ఓ సారి బంగ్లాదేశ్ వెళ్ళివస్తావా?” అని అడిగారు. ఎందుకని షాడో అడగలేదు, ఆయనా వివరాలు చెప్పలేదు. షాడో బంగ్లాదేశ్ చేరే సరికి అతని కోసం బోలెడు సమస్యలు సిద్ధంగా ఉన్నాయి. బయటి శత్రువులని జయించి, ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న ఆ దేశానికి అంతర్గత శత్రువులు తయారయ్యారు. వాళ్ళని ఎదుర్కుని, నిర్మూలించడానికి మిలిటరీ సి. ఐ. డి. గా షాడో రంగంలోకి దిగుతాడు.

తిమోతీ పట్టణంలో అడుగుపెడుతునే షాడోకి ఇబ్బందులు మొదలయ్యాయి. ఏమిటా ప్రమాదాలు? షాడో రాక గురించి శత్రువులకి ఎలా తెలిసిపోయింది? షాడోకి వ్యతిరేకంగా రాసి ప్రజలని రెచ్చగొట్టాలని ఓ మహిళా జర్నలిస్ట్ ఎందుకు ప్రయత్నించింది? మరో పత్రిక యజమాని షాడోకి ఏ విధంగా సాయం చేసాడు?

ఆసాంతం ఆసక్తిగా సాగిపోయే ఈ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మీ కాపీ నేడే సొంతం చేసుకోవడానికి ఇక్కడ నొక్కండి.

సి.ఐ.డి. షాడో On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

చైనీస్ పజిల్

ప్రముఖ డిటెక్టివ్ నవలల రచయిత మధుబాబు కలం నుండి జాలువారిన మరో థ్రిల్లర్ చైనీస్ పజిల్.

ప్రొఫెసర్ హోచిమిన్ పది సంవత్సరాల పాటు కష్టపడి అపూర్వమైన ఒక టాబిలెట్‌ని కనిపెట్టాడు. ఇంతవరకూ ఎటువంటి మందులకూ లొంగని కాన్సర్ వ్యాధిని సైతం రెండు వారాల్లో మటుమాయం చేయగల శక్తి ఆ టాబిలెట్‌కి ఉంది. అయితే దురదృష్టవశాత్తూ ఆ టాబిలెట్‌ని తయారు చేయడంలో ఏదో పొరపాటు జరిగింది. ఫలితంగా కాన్సర్ వ్యాధిని తగ్గించే మందుకు బదులు దారుణ పరిణామాల్ని సృష్టించే మరో పాయిజన్ టాబిలెట్ సృష్టించబడింది.

ఆ పాయిజన్ టాబిలెట్‌ని సేవించినవాళ్ళు తిండి నిద్ర అవసరం లేకుండా ఇరవై నాలుగు రోజులపాటు యంత్రాల్లా పనిచేయగలరు. వాళ్ళ శక్తియుక్తులు, తెలివి తేటలు అన్నీ వందరెట్లు అభివృద్ధి చెందుతాయి. వట్టి చేతులతో కాంక్రీట్ గోడల్ని పగలగొట్టగలరు. ప్రపంచాన్ని అల్లకల్లోలం పాలు చేయటానికి కంకణం కట్టుకొన్న ఏ కిల్లర్స్ గాంగ్‌ దృష్టి ఈ టాబిలెట్‌పై పడిండి. వెంటనే వివిధ దేశాలలో ఉన్న వారి ఏజంట్లు ప్రొఫెసర్ కోసం వేట ప్రారంభిస్తారు. చివరికి బిబ్లీఖాన్ అనుచరులు హోచిమిన్‌ని అపహరించి, చైనా, ఝరియా ఏజెంట్లతో బేరం పెడతారు.

ఇంటర్‌పోల్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన షాడో హోచిమిన్‍ని ఎలా రక్షించాడు? చైనా పజిల్‌ని ఎలా ఛేదించాడో తెలుసుకోవాలంటే ఈ రోమాంచక నవల చదవాలి.

ఈ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్ చూడండి.

చైనీస్ పజిల్ On Kinige

Related Posts:

కౌంటర్‍ఫీట్ కిల్లర్

సుప్రసిధ్ధ రచయిత మధుబాబు కలం నుండి వచ్చిన అద్భుత, సస్పెన్స్ థ్రిల్లర్ “కౌంటర్‍ఫీట్ కిల్లర్“.

మన దేశం ఆర్ధిక వ్యవస్థని చిన్నాభిన్నం చేయడానికి పొరుగుదేశం కుట్ర చేసి దొంగ నోట్లు ముద్రించి, మన దేశంలోకి పంపాలని ప్రయత్నిస్తుంటుంది. ఈ సమాచారం అందుకున్న ప్రభుత్వం స్పెషల్ బ్రాంచ్‍ని రంగంలోకి దించుతుంది. ఈ కుట్రని చేధించడంలోవారు విఫలమవడంతో, ఈ కేసుని సి.ఐ.బికి అప్పగిస్తారు ఆర్ధిక మంత్రి.
ఓ నదిని దాటి షాడో రహస్యంగా పొరుగుదేశంలోకి ప్రవేశిస్తాడు. రకరకాల వేశాలు వేసి దొంగనోట్లను ముద్రించే స్థలాన్ని కనుగొంటాడు. ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంటాడు.

స్పెషల్ బ్రాంచ్ తరపున పొరుగుదేశంలోకి ప్రవేశించిన ఏజెంట్ ఏమయ్యాడు? షాడో ఈ కుట్రని ఎలా అడ్డుకున్నాడు?

ఆసాంతం ఆసక్తిగా సాగిపోయే ఈ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మీ కాపీ నేడే సొంతం చేసుకోడానికి ఇక్కడ నొక్కండి

కౌంటర్‌ఫీట్ కిల్లర్ On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

గన్స్ ఇన్ ది నైట్

ప్రముఖ డిటెక్టివ్ రచయిత మధుబాబు వ్రాసిన మరో సస్పెన్స్ థ్రిల్లర్ “గన్స్ ఇన్ ది నైట్“.

పారిస్‌లో జరిగే ఇంటర్‌పోల్ సమావేశానికి వెళ్ళడానికి సిద్ధమవుతుంటాడు షాడో. ఇంతలో అతనికి మంగోలియా నుంచి ఓ ఉత్తరం వస్తుంది. మిత్రుడు ఖాఖాన్, అతని భార్య సుసీ హత్యకు గురైనట్లు తెలుస్తుంది.

వెంటనే మంగోలియా బయల్దేరుతాడు. తల్లిదండ్రుల హత్యలను తట్టుకోలేని ఖాఖాన్ పిల్లలను కలుసుకుని వాళ్ళకి ధైర్యం నూరిపోసేందుకు, తిరిగి మాములు మనుషులని చేసేందుకు ప్రయత్నిస్తాడు.

వాళ్ళని వెంటబెట్టుకుని గోబీ ఎడారిలో సంచరించాలనుకుంటాడు షాడో. పిల్లలతో కలసి రైలెక్కుతాడు. మార్గమధ్యంలో ఎన్నో ప్రమాదాలు తారసపడతాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఖాఖాన్ దంపతులని చంపిన బందిపోటు ముఠా వెంటబడితే, వాళ్ళని ఏమార్చడానికి ఖాంగాయ్ పర్వత శ్రేణుల వైపు ప్రయాణం సాగిస్తాడు. అక్కడ అనుకోకుండా ఓ లోయలో పడిపోతాడు షాడో. వందల ఏళ్ళుగా ఎవరికి తెలియని ఓ రహస్యాన్ని ఆ లోయలో కనుగొంటాడు.

ఏమిటా రహస్యం? బందిపోట్ల ముఠా అంతు ఎలా చూసాడు? పిల్లలు మాములు మనుషులయ్యారా?

ఆసాంతం ఆసక్తిగా సాగిపోయే ఈ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మీ కాపీ నేడే సొంతం చేసుకోండి.

గన్స్ ఇన్ ది నైట్ On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

ఇన్స్‌పెక్టర్ షాడో

సుప్రసిధ్ధ రచయిత మధుబాబు వ్రాసిన మరో సస్పెన్స్ థ్రిల్లర్ “ఇన్స్‌పెక్టర్ షాడో“.

దేశంలో వున్న నాయకులందర్నీ హతమార్చి, అలర్లు ఆందోళనలు సృష్టించటడానికి పథకం వేసిందో ముఠా. ఆ అల్లర్ల మధ్యగా మన దేశంలోకి అడుగుపెట్టి సింహాసనాన్ని చేజిక్కించుకోవటం కోసం రెడీగా వున్నాయి మన శత్రుదేశాలు.. వారి ఏజెంట్ల ప్రోత్సహంతో దేశద్రోహులు ఒక భయంకర మరణాయుధాన్ని తయారుచేసినట్లు ప్రభుత్వానికి తెలుస్తుంది.

ఈ పథకం మూలాలు ఉత్తర్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో ఉన్నాయని గ్రహించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం షాడోని రంగంలోకి దింపుతుంది. ఓ పోలీస్ ఇన్స్‌పెక్టర్‌లా ఆ పట్టణంలో అడుగుపెట్టిన షాడో కుట్ర పథకాన్ని ఎలా ఛేజించాడు? ఈ ఎస్సైన్‍మెంట్‌లో మిత్రులు ముఖేష్, శ్రీకర్ షాడోకి ఎలా సహకరించారో తెలుసుకోవాలంటే ఈ నవల చదవాల్సిందే.

ఆసాంతం ఆసక్తిగా సాగిపోయే ఈ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మీ కాపీ నేడే సొంతం చేసుకోండి.

ఇన్‌స్పెక్టర్ షాడో On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts: