‘చినుకు’ మాసపత్రికలో ప్రచురించబడిన చిన్న చిన్న కథలతో ఈ పుస్తకాన్ని ప్రచురించారు. మధ్యతరగతి సంసారాల్లో జరిగే సంఘటనలకు కాస్తంత హాస్యం జోడించి కథలుగా రూపొందించారు. సుబ్బారావూ సుబ్బలక్ష్మీ ఈ కథలలో నాయికా నాయకులు.పెన్ను, సెల్ఫోను లాంటి ఇంగ్లీషు పదాలు తెలుగులో కలసిపోయాయి. మాతృభాషాభిమానంతో అన్నీ తెలుగులో పలకాలని ప్రయత్నిస్తే ఎంత గందరగోళంగా ఉంటుందో తెలిపే కథ ‘బాబాయ్ అభిమతం’.శ్రీరామ నవమి పందిట్లోనుంచి చెవులు చిల్లుపడేటట్లు వస్తున్న పాటలకు తట్టుకోలేకపోయింది సుబ్బలక్ష్మి. బాగా ఆలోచించి మైక్ సెట్ కట్టేయించడానికి ఒక పథకం వేసి విజయం సాధిస్తుంది. ‘శ్రీరామనవమి’ కథలో ఇది కథాంశం.అన్నం తిన్నాక కంచం కడిగి బోర్లించడం మొదలుపెట్టాడు సుబ్బారావు. వద్దని సుబ్బలక్ష్మి చెప్తున్నా వినిపించుకోడు. కొన్నాళ్లయ్యాక పరిస్థితి మారిపోవడంతో కడగడం మానేస్తాడు సుబ్బారావు. ఇది ‘ఎంగిలి పళ్లెం’ కథ.పుస్తకమంతా ఇటువంటి చిన్న చిన్న సంఘటనలతో ఉంది. కథల సంఖ్య 21. పుస్తకం చివర ‘మల్లెతీగ’ పేరుతో ఒక నాటిక కూడా ఉంది. అందులోనూ హాస్యరసం ప్రధానాంశం.
-ఎం.వి.శాస్ర్తి,ఆంధ్రభూమి-అక్షర,27-09-2014.
“సుబ్బలక్ష్మి కథలు” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగె లో లభిస్తుంది. కినిగె వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి..
సుబ్బలక్ష్మి కథలు on kinige