మీరు రచయితలా? మీరు రచయిత్రులా? మీ పుస్తకాన్ని ఇప్పుడు ఈ-పుస్తకంగా కినిగెలో ఉంచి పాఠకులకు చేర్చడం చాలా సులభం. మీరు ఇప్పుడు ప్రింట్ పుస్తకాన్నే కాదు, ఈ-పుస్తకం కూడా అమ్మవచ్చు.
మీరు మీ ప్రింట్ పుస్తకం కోసం వేలు ఖర్చుపెట్టి పాఠకులకు చేర్చే ముందే, అతి తక్కువ ఖర్చుతో ఈపుస్తకాన్ని కినిగె ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పాఠకులకు అందుబాటులోకి తీసుకురండి.
కినిగెలో పుస్తకం సబ్మిట్ చెయ్యడానికి కావాల్సినవి
1. పుస్తకం కవర్ పుట – జేపెగ్ ఫార్మాటులో ఐదు యంబీ కన్నా తక్కువ సైజులో.
2. పుస్తకం రన్నింగ్ పాఠ్యం – పీడీయఫ్ లేదా పేజ్ మేకర్ ఫైళ్ళు. పరిమాణం ఐదు యంబీ కన్నా తక్కువ.
3. పుస్తకం యొక్క పూర్తి కాపీరైట్ హక్కులు ఎటువంటి సమస్యా లేకుండా మీ వద్దే ఉండాలి.
మీ వద్ద పైన చెప్పిన ఫైళ్ళు ఎక్కువ పరిమాణంలో ఉన్నా, వేరే ఫార్మాటులలో ఉన్నా (ఉదాహరణకు మైక్రోసాఫ్ట్ వర్డ్) కినిగె సపోర్ట్ కు ఒక వేగు పంపండి. సహాయం మీకు వేగు దూరమే. support@kinige.com
ఇహ కినిగెలో పుస్తకం సబ్మిట్ చెయ్యడం ఎలానో వివరంగా చూద్దాం.
మొదటగా మీరు www.kinige.com దర్శించి, అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోడం అంటే మీ పేరు మీద ఓ ఖాతా సృష్టించుకోడమే. కినిగె ఖాతా సృష్టించుకోవడం పూర్తిగా ఉచితం మరియు సులభం కూడా. (రిజిస్టరు చేసుకోవడం కోసం మరింత సహాయం కోసం ఈ పుటలో వివరించిన సోపానాలు చూడండి – http://enblog.kinige.com/?p=169 )
http://kinige.com మీ విహారిణిలో తెరిచి తరువాత, కుడి వైపుకి పై భాగంలో ఉన్న Submit your book అని ఉన్న లింకు నొక్కండి. అక్కడ ఈ దిగువ చూపిన ఆప్షన్లు కనిపిస్తాయి.
మీ పుస్తకానికి సరిపోయే ఆప్షన్ ఎన్నుకోని ముందుకు వెళ్లండి. తరువాత మూడు స్క్రీన్లలో మీ పుస్తకం గురించిన వివిధ వివరాలు (పేరు, వివరణ, కవర్, రన్నింగ్ టెక్స్ట్ వంటివి) ప్రవేశపెట్టి కినిగెకు మీ పుస్తకాన్ని అతి సులభంగా సమర్పించవచ్చు.
ఈ ప్రక్రియని వివరంగా చూద్దాం.
పుస్తకం పేరు (పుస్తకంలోని భాషలో ఉన్నది ఉన్నట్లుగా), ఆంగ్లంలో పుస్తకం పేరు, పుస్తకం భాష, పుస్తకం గరిష్ట వెల, (తగ్గింపు తర్వాతి) పుస్తకం వెల నింపాలి. ఆ తరువాత, నెల సరి అద్దె, జరిగిన ప్రతీ అమ్మకంపై మీకు అందే పైకం, అద్దెకు తీసుకున్న ప్రతీ పుస్తకం పై మీకు వచ్చే పైకం వివరాలను కంప్యూటర్ లెక్కించి గడిలో నింపుతుంది. మీ పుస్తకం “పెద్దలకు మాత్రమే” అయితే, సంబంధిత గడిలో టిక్ పెట్టాలి. తరువాత రచయిత పేరు రాయాలి. రచయిత యొక్క ప్రాంతాలను (కనీసం రెండు) నింపాలి.
నియమనిబంధనలను అంగీకరిస్తున్నట్లుగా Next బటన్పై నొక్కి, తర్వాత అంచెకి వెళ్ళాలి.
మీకు తెరమీద ఇలా వస్తుంది
మీ పుస్తకం యొక్క కవర్ పేజిని (జె.పి.జి ఇమేజ్ రూపంలో), పాఠ్యాన్ని (పిడిఎఫ్ రూపంలో లేదా పేజ్ మేకర్ ఫైల్ రూపంలో) అప్లోడ్ చేయాలి.
తర్వాత, Next బటన్పై నొక్కి, తర్వాత అంచెకి వెళ్ళాలి.
అప్పుడు మీకు తెరమీద ఇలా వస్తుంది
మీ పుస్తకాన్ని సూచించే కీలక పదాలు (కీ వర్డ్స్ లేదా టాగ్స్) నిర్ధారిత గడిలో నింపాలి (కనీసం మూడైనా ఉండాలి). తరువాత మీ పుస్తకాన్ని సూచించే విభాగాలను (కేటగిరీ) – రెండింటిని ఎంచుకోవాలి (డ్రాప్ డౌన్ మెను ద్వారా). మీ పుస్తకం గురించి తెలిపేందుకు నిర్ధారిత గడిలో (పుస్తకం యొక్క భాషలోనే) వివరణ రాయాలి.
చివరగా, “ఫినిష్” అనే బటన్ నొక్కితే చాలు. మీ పుస్తకం కినిగెపై ప్రచురణకు సిద్ధమైనట్లే.
మీకింకా ఏవైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే support@kinige.com కు ఈ-మెయిల్ చెయ్యండి.