ఇరవయ్ ఒకటో ‘కథ’ అనే శీర్షికతో ది. 20 ఫిబ్రవరి 2012 నాటి సాక్షి దినపత్రికలో ‘కథ 2010’ సంకలనం పై సమీక్ష వెలువడింది.
‘కథ’ వార్షిక సంకలనాల వరుసలో ‘కథ 2010’ ఇరవయ్ ఒకటవది. ఇందులో పద మూడు కథలు ఉన్నాయి.
‘కథ’ సంకలనాలలో కనిపించే కథలూ, వాటి కథకులనూ పరిశీలిస్తే సంకలనకర్తల ప్రాధాన్యం అర్థమవుతుందని సమీక్షకులు వి. ఆర్. పేర్కొన్నారు. కొత్తదనం, ప్రయోగం సంపాదకుల దృష్టిలో అత్యవసరమని భావించారు.
ఎనభయ్యవ దశకం వరకు తెలుగు కథలు చదవగానే అవి బాగున్నాయో, లేదో రచయితలకే కాదు, సాధారణ పాఠకులకీ వెంటనే తెలిసేదని. ఇప్పటి కథలను చదివి జీర్ణించుకోవడానికి సాధారణ పాఠ కులతో పాటు రచయితలూ, విమర్శకులకు కూడా కొంత శోధన, ఓపిక అవసరమవుతోందని సమీక్షకులు అభిప్రాయపడ్డారు. ‘కథ’ సంకలనాలలో రకరకాల ప్రయోగాలు, ధోరణులు , అందుకు ప్రయత్నాలు కనిపిస్తాయని వి. ఆర్. అన్నారు. కొత్తదనాన్ని ఆహ్వానించడం అవసరమేనంటూ, అటువంటి ప్రయోగాలు ఎంతవరకు ఫలప్రదమైనాయో, వాటి ఫలితాలు ఎలా ఉంటున్నాయో చూడడమూ కూడా అవసరమే సమీక్షకులు భావించారు.
పూర్తి సమీక్షని ఈ లింక్లో చదవచ్చు.
కథ 2010 డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. పూర్తి వివరాలకై ఈ క్రింది లింక్ని అనుసరించండి.
అలాగే, ‘కథ’ పాత సంకలనాలు కూడా డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి. మరిన్ని వివరాలకు ఈ లింక్ని అనుసరించండి.
కొల్లూరి సోమ శంకర్