ఫ్లయింగ్ హార్స్

ప్రముఖ డిటెక్టివ్ రచయిత మధుబాబు రచించిన థ్రిల్లర్ ఫ్లయింగ్ హార్స్.

ప్రపంచమంతా జయించి ఒకే పతాకం క్రిందికి తీసుకు రావాలనే ఆశయంతో పని చేస్తున్న వరల్డ్ వైడ్ క్రిమినల్ ఆర్గనైజేషన్ కిల్లర్స్ గాంగ్‌కి పోటీగా నిలువదలుచుకున్నాడు డాక్టర్స్ ఎక్స్. అయితే వారిలా నేరాలు చేయించి ధనం కూడ బెట్టటం, పరపతి పెంచుకోవటం అతనికి యిష్టం లేదు. కొట్టేది ఒకే దెబ్బ అయినా,ఆ ఒక్క దెబ్బకే అందరూ దద్దరిల్లి పోవాలని అతని కోరిక. అందుకే ఎవరికీ తెలియకుండా, ఎవరికంటా పడకుండా రహస్య జీవితాన్ని గడుపుతూ, ప్రపంచం మొత్తం మీద జరుగుతూ వుండే సైంటిఫిక్ పరిశోధనలన్నిటినీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేశాడు.

శబ్దాలకు సంబంధించిన ప్రయోగాలు చేస్తూ అపూర్వమయిన అల్ట్రాసోనిక్ సౌండ్ ప్రొజెక్టర్‌ని కనిపెట్టాడు ఒక ఇటాలియన్ సైంటిస్ట్. తన ప్రభుత్వం అంతరిక్షంలోకి పంపుతున్న ఒక ఉపగ్రహానికి దాన్ని బిగించి, అంతరిక్ష పరిశోధనలు చేద్దామని అనుకుంటుండగా, భూమి వాతావరణాన్ని దాటి పైకి పోగానే అనుకోని విధంగా కొన్నివేల రెట్లు వృద్ధి అయింది ఆ సాధనం యొక్క శక్తి. దానిలో నుంచి వెలువడే అల్ట్రాసోనిక్ సౌండ్స్ సూటిగా వచ్చి భూమిని తాకటం మొదలు పెట్టాయి… తాకిన ప్రతి ప్రదేశంలోను కనీ విని ఎరుగని ప్రళయం ఉత్పన్నమయింది. అతికష్టం మీద ఆ సాధనం బిగించి వున్న ఉపగ్రహాన్ని పల్టీ కొట్టింది, భూమి మీదికి వస్తున్న శబ్ధ తరంగాల్ని అంతరిక్షం వైపు పంపగలిగారు ఇతర సైంటిస్టులు… ఆ ప్రయత్నంలో ఉపగ్రహం మీద తమకు ఉన్న కంట్రోల్‌ని పోగొట్టుకున్నారు. కంట్రోల్ తప్పిన ఉపగ్రహం తిరిగి ఎప్పుడు ఇంకో పల్టీ కొడుతుందో ఎవరికీ తెలియదు… అలా జరిగిన మరుక్షణం మరోసారి భూమిని ఎటాక్ చేస్తాయి అల్ట్రాసోనిక్ సౌండ్స్.

ఆ దారుణం జరిగేలోగా ఆ సాధనాన్ని నిరుపయోగం చేయాలనే తపనతో నిద్రాహారాలు మాని శ్రమించాడు ఇటాలియన్ సైంటిస్ట్. సౌండ్ ప్రొజెక్టర్‌లో నుంచి వెలువడే సౌండ్స్‌ని తట్టుకొని ఉపగ్రహంతో సహా ఆ సాధనాన్ని ధ్వంసం చేయగల మాగ్నటిక్ రేడియో సౌండ్స్‌ని సృష్టించటంలో సగం వరకూ కృతకృత్యుడు అయినాడు. ఆ ప్రయత్నం పరిపూర్ణమైతే ప్రమాదం తప్పిపోయినట్లే అని అందరూ సంతోషిస్తున్న సమయంలో – అదను చూసి దెబ్బ తీశాడు డాక్టర్ ఎక్స్. ఇటాలియన్ సైంటిస్ట్‌ని కిడ్నాప్ చేసి తన వద్దకు రప్పించుకున్నాడు. అత్యంత ప్రమాదకరమైన అల్ట్రాసోనిక్ సౌండ్ ప్రొజెక్టర్‌ని ఆ సైంటిస్ట్ సహాయంతో తన చెప్పుచేతల్లోకి తెచ్చుకొని, దాని ద్వారా ప్రపంచాన్నంతా బ్లాక్‌మెయిల్ చేయటమే డాక్టర్ ఎక్స్ ఉద్దేశ్యం.

ఇటాలియన్ ప్రభుత్వ అభ్యర్ధనపై రంగంలోకి వచ్చింది ఇంటర్‌పోల్. సౌండ్ ఇంజనీరింగ్‌లో మంచి ప్రవేశం వున్న మిస్ టోరీ అనే ఇంటర్‌పోల్ ఏజెంట్‌ని, షాడోని సింగపూర్ పంపించింది. కిడ్నాప్ చేయబడిన సైంటిస్ట్‌ని మొదట సింగపూర్‌లో దాచాడు డాక్టర్ ఎక్స్. ఇంటర్‌పోల్ జోక్యం చేసుకోవటంతో అతన్ని సుమత్రా ఐలండ్‌కి తరలించాడు.
ఆ విషయాన్ని గ్రహించి సుమత్రా బయలుదేరాడు షాడో.

డాక్టర్ ఎక్స్‌నీ, అతని అనుచరగణాన్ని ఎలా ఎదుర్కున్నాడు? షాడోని డాక్టర్ ఎక్స్‌కి పట్టించిన పక్షులు ఏవి? వళ్ళంతా విషపూరితమైన పాయిజన్ పాషాని షాడో ఎలా నిలువరించాడు? ఇంతకీ ఇటాలియన్ సైంటిస్ట్‌ని కాపాడగలిగాడా లేదా?

ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు “ప్లయింగ్ హార్స్” నవలలో దొరుకుతాయి. చివరిదాక ఆసక్తిగా చదివించే ఈ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ చూడండి.

ఫ్లయింగ్ హార్స్ On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

ఎ మినిట్ ఇన్ హెల్

ప్రముఖ డిటెక్టివ్ రచయిత మధుబాబు కలం నుంచి జాలువారిన షాడో స్పై థ్రిల్లర్ “ఎ మినిట్ ఇన్ హెల్“.

డాక్టర్ హుయత్సాన్ చైనా దేశపు ఆటమిక్ సైంటిస్ట్. తన ప్రభుత్వాన్ని వప్పించి ఏడు శక్తివంతమైన అణుబాంబులను తయారు చేశాడు. వాటిని మోయటానికి ఏడు ఖండాంతర రాకెట్లు నిర్మించాడు. మొదట ప్రపంచం మీదగాని, భారతదేశంమీద గాని దండెత్తేందుకు కావాల్సిన బాంబులు తయారు కావటానికి రెండు సంవత్సరాలు పడుతుందని మనకు చేరిన వార్తలు నిజం కాదని, మరో పదిహేను రోజుల్లో ప్రపంచాన్నంతా మట్టి కలపాలని హుయత్సాన్ నిర్ణయించుకున్నాడని ఖచ్చితమైన సమాచారం లభించింది.

వెంటనే సి. ఐ. బి తరపున షాడో రంగంలోకి దిగుతాడు. “రాజూ…. ఆ రాకెట్లు నాశనం అయిపోవాలి. వాటితో పాటు ఆ బాంబులు కూడా” అని కులకర్ణిగారు ఆర్డర్ వేసారు.

ముందుగా హాంగ్‌కాంగ్ చేరుతాడు షాడో. అక్కడ రష్యన్ లేడీ ఏజంట్ టాన్యాని కలిసి ప్రణాళికలు రూపొందిస్తాడు. క్వాంటుంగ్ ఏరియాలో చిల్లంగ్ రైలు మార్గానికి వుత్తరదిశన ఎక్కడో డాక్టర్ హుయత్సాన్ తన స్థావరాన్ని నిర్మించుకున్నాడని, ఆ స్థావరంలోనే రాకెట్స్ బాంబులతో సిద్ధంగా వున్నాయని, వాటిని ఎప్పుడు. ఎలా ప్రయోగించాలి? అన్న విషయాలన్నీ డాక్టర్ హుయత్సాన్‌కే వదిలి వేయబడ్డాయని తెలుసుకుంటాడు షాడో.

ఈ ఎస్సైన్‌మెంట్‌లో టాన్యాకి ఆమె సోదరి నాద్యా తోడవుతుంది. ముగ్గురు కలసి ఆ స్థావరం కోసం వేట ప్రారంభిస్తారు. ఓ బోటు లో హ్యు ఛానెల్ దాటుతారు.

మార్గమధ్యంలో ఎన్నో ప్రమాదాలను, ఆటంకాలని ఎదుర్కుని ఆ స్థావరం చేరుకుంటారు. షాడో భుజంలో ఉన్న ఎలెక్ట్రానిక్ పరికరాన్ని హుయత్సాన్ స్థావరంలోని యంత్రాలు ఎందుకు కనిపెట్టలేకపోయాయి? పట్టుబడిన టాన్యా, నాద్యాలను ఎటువంటి చిత్రహింసలకి గురిచేసారు హుయత్సాన్? షాడో ఆ రాకెట్లను ఎలా ధ్వంసం చేసాడు? ఆ తర్వాత అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నాడు? తనని వెంటాడిని మిలిటరీ అధికారులను ఎలా ఏమార్చాడు? చైనా లోంచి ఇండియాలోకి ఎలా ప్రవేశించాడు?

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ రోమాంచక నవలలో లభిస్తాయి.

“ఎ మినిట్ ఇన్ హెల్” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

ఎ మినిట్ ఇన్ హెల్ On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts: