రాలిన కథా కుసుమం

తన రచనలలో మార్మికతకు పెద్దపీట వేసి, కేవలం 15 కథలతోనే చదువరులను అభిమానులుగా మార్చుకున్న త్రిపుర 24 మే 2013 న దివంగతులయ్యారు.

సెప్టెంబరు 2, 1928 నాడు జన్మించిన రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర రావు (ఆర్.వి. టి. కె. రావు) ఉరఫ్ త్రిపుర, తన మొదటి కథ 31-5-1963 నాటి ఆంధ్రపత్రికలో ప్రచురించారు. 2012-13 నాటికి త్రిపుర సాహితీసృజనకి యాభై సంవత్సరాలు పూర్తవుతాయి.

త్రిపుర కథల విలక్షణత అయన ఎత్తుగడలో ఉంటుంది, మొదటే అర్థం కాలేదని పుస్తకం పక్కన పడేస్తే మాత్రం కొన్ని అద్భుతమైన కథలని కోల్పోయిన వారవుతారు. మొదట అర్థం కానట్టు అనిపించినా, చదివే కొద్దీ కొత్త భావాలేవో అనుభవంలోకి వస్తున్నట్లు, మళ్ళీ మళ్లీ చదవాలనుకుంటారు పాఠకులు. కథలు సంక్లిష్టంగా అనిపిస్తాయి, వాటి పరిథి పెద్దది – ఫ్లోరిడా, వారణాశి, కేరళ, రంగూన్, థాయిలాండ్, సరిహద్దు ప్రాంతాలు – ఎన్నో చుట్టి వస్తాయి యీ కథలు. జెన్ బౌద్ధం మొదలు నక్సలిజం దాకా అనేక శ్రేణుల్లో తత్త్వచింతన ఈ కథల్లో ఉంది. చదివేకొద్దీ, మరింతగా చదివించే గుణం ఉన్న కథలివి. ఈ కథల్లో సర్రియలిజం, ట్రాన్స్‌పరెంట్ చీకటీ ఉండి అంతర్ముఖీనమైపోయే ఒక కన్ఫెషనల్ ఎలిమెంట్ కనపడుతుందని సుధామ అంటారు.

త్రిపుర కథలే కాకుండా కవితలూ అద్భుతంగా ఉంటాయి. తన 47వ పుట్టిన రోజు సందర్భంగా ” సెగ్మెంట్స్” అనే ఆత్మకథాత్మక దీర్ఘకవితని రాసారు. దీన్ని మరో ప్రముఖ కవి వేగుంట మోహన్ ప్రసాద్ త్రిపుర స్వశకలాలు పేరుతో తెలుగులోకి అనువదించారు. ఫ్రాంజ్ కాఫ్కాకి వీరాభిమాని అయిన త్రిపుర ఆయన ప్రేరణతో, “త్రిపుర కాఫ్కా కవితలు” రాసారు. కాఫ్కా రచనల్లోని నిగూఢత్వం ఈ కవితల్లోనూ గోచరిస్తుంది. ఈ పుస్తకాన్ని “సాహితీమిత్రులు” ప్రచురించారు. 1980 – 1988 మధ్యలో త్రిపుర రాసిన 16 కవితలని “కవిత్వం ప్రచురణలు” వారు “బాధలూ -సందర్భాలూ” అనే శీర్షికతో నవంబరు 1990లో ప్రచురించారు.

“త్రిపుర కథలు, కవితలు, సంభాషణలు, మౌనం ఇవి వేరు వేరు కావు. అవన్నీ కలిసి అల్లే దారులు ఎంతో విస్తారము, సాధారణమైన అనుభవాల కంటె లోతు, అపరిచితమైన సృజనావరణానికి దిక్సూచికల వంటివి” అని అంటారు కనకప్రసాద్.

చక్కని సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి ఈ త్రిపుర రచనలు.

తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడంలో తనవంతు పాత్ర పోషించి, కథనరంగం నుంచి నిష్క్రమించిన త్రిపురకి హృదయపూర్వక నివాళి అర్పిస్తోంది కినిగె.

Related Posts:

మిసిమి ఏప్రిల్ 2011 సంపాదకీయం

మిసిమి – ఏప్రిల్ 2011 On Kinige

గడచిన దశాబ్దంలోని వివిధ సారస్వత ప్రక్రియల పరిశీలన చేయాలని సంకల్పించి రచయిత లెందరినో అడిగాము. మొదటగా కవిత్వధోరణులు గూర్చి తమ అమూల్యమైన పరిశీలనా వ్యాసాలను అందించిన వారు వేగుంట మోహనప్రసాద్. మొదటి భాగం ఈ నెల ప్రచురిస్తున్నాము.

‘నటరత్నాల’ను తెలుగువారికి అందించిన నటరత్నం మిక్కిలినేని అన్ని జానపద కళారూపాల సమాహారం! వారి నిష్క్రమణకు నివాళి.

తెలుగు పాఠకుల, ప్రేక్షకుల మనసుల్లో నవ్వుల జల్లులు కురిపించిన ముళ్ళపూడి వెంకటరమణ ‘కోతి కొమ్మచ్చి’ ఆటలో ఎటో వెళ్ళిపోయారు.

తన అనుభవాలను, ఆలోచనలతో రంగరించి, ఊహలతో రంగులద్ది సార్వజనీనత సాధించిన బషీర్ తన కథలను వినోద సమాసాలుగా పాఠకులకు అందించారు.

ఉగాది వచ్చింది, ఎన్నో సమస్యలతో. సమస్య లేకపోతే పరిష్కారమూ ఉండదు కదా! ఇల్లు వదినిల దగ్గరనుంచి మళ్ళీ ఇంటికి చేరేవరకు కనపడని శత్రువుతో పోరాటం సాగిస్తూ అలసిపోతున్న సగటుమనిషికి పండగ రోజే కాస్త ఊరట!

మే నెల సంచిక ‘బుద్ధ జయంతి’ ప్రత్యేకం. బౌద్ధతత్వాన్ని, సాహిత్యాన్ని ఆకళింపు జేసుకుని తెలుగులో సరళంగా తెలియజేయగలిగిన రచనలు ప్రచురిస్తామని తెలియజేస్తూ ఈ దిశగా రచనలు పంపవలసిందిగా ఆహ్వానిస్తున్నాము.

– సంపాదకులు మిసిమి – ఏప్రిల్ 2011 On Kinige

 

This wonderful magazine is now available for just 30Rs in Digital format on Kinige. Click on above thumbnail for more details.

Related Posts: