చక్కని కథలు – ‘తురగా జానకీరాణి కథలు’ పుస్తకంపై సమీక్ష

తురగా జానకీరాణి కథల్లో చక్కని మానసిక విశ్లేషణ ఉంటుంది. పేజీలకు పేజీల వర్ణనలు మచ్చుకైనా కానరావు. చిట్టిపొట్టి మెరుపులే అధికం. సంకలనంలోని దాదాపు ముప్ఫై కథలూ తురగావారి శైలికి అద్దంపట్టేవే. దశాబ్దాల క్రితం రాసినవే అయినా… పాత కథల్ని చదువుతున్న భావన పాఠకుడికి కలగదు. అక్కడక్కడా కలిగినా, అది పాతావకాయ లాంటి కమ్మదనమే. ‘దైనందినం’లో నవదంపతుల మధ్య ఏర్పడే చిన్నచిన్న కలహాల్నీ అందమైన సర్దుబాట్లనూ సున్నితంగా వ్యక్తీకరించారు. అక్క, చెల్లి, అక్క భర్త- బావ… మూడు పాత్రలూ తమలోని మరొకరి గురించి ఎలా ఆలోచిస్తాయో, ఎలా వూహించుకుంటాయో హృద్యంగా వివరించిన కథ ‘అవతలి కోణం’. కౌమారంలోని విద్యార్థినీ విద్యార్థుల ప్రవర్తనల్ని విశ్లేషించే కథ ‘వయసు గతి ఇంతే’. నిజానికి ఏ కథనూ ఇంకో కథతో పోల్చలేం. దేనికదే వైవిధ్యం. సంకలనంలోని కథల్ని రచయిత్రి మూడు రకాలుగా వర్గీకరించారు. చిన్నప్పుడు రాసినవాటిని ‘తెలివి యొకింతలేని యెడ’ అన్నారు, ఆతర్వాత రాసినవాటిని ‘ఇంచుక బోధశాలినై’ అని చెప్పుకున్నారు. మూడోవిభాగం ‘వాస్తవ గాథలు’. ఇవి జీవితంలో తారసపడిన సంఘటనలూ అనుభవాలూ కావచ్చు.

                                      —ధీమహి, ఈనాడు ఆదివారం అనుబంధం, 12th Jan 2014

 ఈ ఆర్టికల్‌ని ఈనాడు పుస్తకం పేజీలో చదవడం కొరకు ఈ క్రింద లింక్ క్లిక్ చేయండి

http://archives.eenadu.net/01-12-2014/Magzines/Sundayspecialinner.aspx?qry=pustaka

 

 

 

 

 

 

 

 

తురగా జానకీరాణి కథలు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింక్‌ని అనుసరించండి.

***

తురగా జానకీరాణి కథలు on Kinige

Related Posts:

తురగా జానకీరాణి కథలు

రేడియో అక్కయ్యగా తెలుగు వారందరికీ సుపరిచితురాలైన శ్రీమతి తురగా జానకీరాణి గారి కథల పుస్తకం “తురగా జానకీరాణి కథలు” ఈ దసరా పండుగనాడు ఆవిష్కరించబడడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది.

ఈ శుభసందర్భంలో వారికి ఇవే మా శుభాకాంక్షలు.

శ్రీ తురగా కృష్ణమోహన్ గారి “మాట కచ్చేరి” పుస్తకాన్ని ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగువారందరి దగ్గరకు ఈ-బుక్స్ రూపంలో తీసుకువెళ్ళడానికి మా కినిగె.కాం సంస్థను తమ భాగస్వామిగా చేసుకున్నందుకు శ్రీమతి తురగా జానకీ రాణి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.

ఈ సందర్భంగా “తురగా కృష్ణమోహనరావు పాత్రికేయ పురస్కారాన్ని” అందుకోబోతున్న ప్రసిద్ధ పాత్రికేయులు శ్రీ బండారు శ్రీనివాసరావు గారికి, మా దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము.

ఇంకా ఈ సభకు విచ్చేసిన ప్రముఖులు, మాజీ తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి శ్రీ ఎన్.గోపి గారికి, లోక్‌సత్తా పార్టీ అధినేత, శాసన సభ్యులు శ్రీ జయప్రకాష్ నారాయణ గారికి, విఖ్యాత పాత్రికేయులు, సంపాదకులు శ్రీ ఎబికె ప్రసాద్ గారికి, మిగతా పెద్దలందరికీ పేరు పేరునా నమస్కారములు తెలియజేస్తున్నాము.

అభినందనలతో,

అనిల్ అట్లూరి,
కినిగె.కాం బృందం

Related Posts: