కథా విశ్లేషణ పోటీ!

తెలుగు కథ శతవార్షికోత్సవ కానుక వర్తమాన కథాకదంబం కథాజగత్‌లో 200 కథలు ప్రకటించిన సందర్భంగా తురుపుముక్క తెలుగు బ్లాగర్లకు ఒక పోటీ నిర్వహిస్తోంది.

ఈ పోటీకి తెలుగులో బ్లాగులు నడుపుతున్న ప్రతి ఒక్కరూ అర్హులే. మీరు చేయవలసినదల్లా కథాజగత్‌లోని కథల్లో ఒక కథను ఎంపిక చేసుకుని ఆ కథ మీకు ఎందుకు నచ్చిందో, లేదా ఎందుకు నచ్చలేదో వివరిస్తూ ఆ కథపై మీ విశ్లేషణను ఇచ్చిన గడువులోగా మీ బ్లాగులో ఒక టపా వ్రాసి ఆ టపా లంకెను తురుపుముక్క బ్లాగులో కామెంటు రూపంలో ఇవ్వడమే.

వచ్చిన ఎంట్రీలలో ఉత్తమమైన మూడు విశ్లేషణలను కథాసాహిత్యంలో పేరుగాంచిన న్యాయనిర్ణేతలచే ఎంపిక చేయించి బహుమతులు ఇవ్వనున్నారు.

బహుమతుల వివరాలు:
మొదటి బహుమతి : 2000/- రూపాయల విలువ చేసే కినిగె.కాం వారి గిఫ్ట్ కూపన్
రెండవ బహుమతి : 1000/- రూపాయల విలువ చేసే కినిగె.కాం వారి గిఫ్ట్ కూపన్
మూడవ బహుమతి : 500/- రూపాయల విలువ చేసే కినిగె.కాం వారి గిఫ్ట్ కూపన్
మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒక ప్రోత్సాహక బహుమతి.

ఈ పోటీలో పాల్గొనడానికి చివరి తేదీ 31-01-2012.

పూర్తి వివరాలకు తురుపుముక్క బ్లాగులోని ఈ టపా చూడండి.

Related Posts: