సామాజిక దృక్కోణాన్ని ఆవిష్కరించే కథల్లో వర్తమాన జీవితం తొణికిసలాడుతుంది, చుట్టూ కనిపించే పరిస్థితుల్నే కథలుగా అల్లిన వైనం ప్రస్ఫుటమవుతుంది. రాచపూటి రమేశ్ ‘వలయం’ సంపుటి ఇందుకు ఉదాహరణ. మధ్యతరగతి స్థితిగతుల్నీ సంక్షోభాల్నీ ఆనందాల్నీ రచయిత కథల ద్వారా ఆవిష్కరించారు. చేనేతకారుల వెతలకూ కతలకూ ‘తాతకో నూలుపోగు’ అద్దంపడితే, ‘కొన్ని జీవితాలింతే’ ఓ ఏకాకి జీవితపు హృదయ స్పందనల్ని అక్షరీకరించింది. వియ్యాలవారి కయ్యాల్ని ‘ఎదురుకోట’ వైవిధ్యంగా వివరిస్తే, ‘వారికి కొంచెం నమ్మకమివ్వండి’ వ్యథాభరిత పరిస్థితుల్లో ఆశావాదాన్ని ప్రకటిస్తుంది. మనిషితనమే అసలైన మతమనే సిద్ధాంతాన్ని ‘నీడలు… నిజాలు’ మరోసారి గుర్తుచేస్తే, ‘వెంటవచ్చేది’ జీవన పరమార్ధాన్ని వెల్లడించింది. ప్రతి కథలో కొత్త మెరుపును దర్శింపజేయాలన్న రచయిత దృక్పథం మెచ్చదగినది.
—-కావూరి వంశీ విద్వత్, ఆదివారం అనుబంధం, 16th Feb 2014
“వలయం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింక్ని అనుసరించండి.
***