ప్రముఖ డిటెక్టివ్ నవలా రచయిత మధుబాబు కలం నుంచి జాలు వారిన మరో సస్పెన్స్ థ్రిల్లర్ నెవర్ లవ్ ఎ స్పై.
నవల షాడో బిందుల పెళ్ళితో ప్రారంభమవుతుంది. పెళ్ళికి షాడోకి కావల్సిన వాళ్ళంతా వస్తారు, పెళ్లి ఘనంగా జరుగుతుంది. కొత్త దంపతులు హనీమూన్‌కి నేపాల్ వెడతారు. రెండు నెలలు సెలవిచ్చిన కులకర్ణి, నేపాల్ విడిచి ఎక్కడికీ వెళ్ళద్దని షాడోని హెచ్చరిస్తారు. ఆనందంగా కాలం గడుపుతున్న షాడోకు రామతీర్ధ నుంచి ఓ ఉత్తరం అందుతుంది. వెంటనే వచ్చి తనని కలుసుకోమని రాస్తాడు రామతీర్ధ.
భారతదేశం నుంచి పారిపోయివచ్చిన సైంటిస్ట్ జనార్ధన్ వివరాలు చెప్పాలని పిలిచిన రామతీర్ధ, ఆ వివరాలేమీ చెప్పకుండానే దుండగులు దాడిలో చనిపోతాడు. హనీమూన్ సంగతి పక్కకి పెట్టి బిందూ, షాడోలు జనార్ధన్ జాడకోసం రంగంలోకి దిగుతారు. ఎన్నో సాహసకృత్యాలు చేస్తారు, ఎన్నో ప్రమాదాలను ఎదుర్కుంటారు.
సైంటిస్ట్ జనార్ధన్ని ఎవరు, ఎందుకు అపహరించారు? ఏమాశించి జనార్ధన్ భారతదేశాన్ని విడిచాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే ఈ రోమాంచక నవల చదవాల్సిందే.
ఈ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి
కొల్లూరి సోమ శంకర్