విభిన్న కోణం.. “తలుగు” పుస్తకంపై సమీక్ష

డబ్బు చేతులు మారాక, వస్తువు కొన్న వాడిదే. దాని లాభనష్టాల భారమంతా సొంతం చేసుకున్నవాడిపైనే ఉంటుంది. కానీ, అది ఓ వస్తువు కాకుండా ప్రాణి అయితే… చంపేందుకు అమ్మిన గొడ్డు గేదె కాస్తా బతికి బట్టకడితే, పాడిగేదెగా మారితే… అది కొన్నవాడిదే అవుతుందా, లేకపోతే అమ్మిన వాడింటికి దాన్ని మళ్లీ తోలెయ్యాలా? ఇలాంటి సందర్భాల్లో న్యాయం డబ్బున్నవాళ్లవైపే ఉంటుందా లేక పేదోడివైపు మొగ్గుతుందా? – ఇలా అనేకానేక ప్రశ్నలూ సమాధానాల పరంపరగా నడుస్తుంది వేంపల్లె షరీఫ్ రాసిన ‘తలుగు‘ కథ. పేద ముస్లింల జీవితాల ఆధారంగా ప్రాణంపోసిన రచన ఇది. ఇందులో గొడ్డుమాంసాన్ని అమ్మే కటిక వ్యాపారి మనస్తత్వాన్ని భిన్నమైన కోణంలో చూపించే ప్రయత్నం చేశారు రచయిత. తలుగు అంటే రాయలసీమ మాండలికంలో పశువుల మెడకువేసే తాడు. పుస్తకం చివర్లోని షేక్ హుస్సేన్ సత్యాగ్ని వ్యాసం ‘విస్తరిస్తున్న ముస్లిం కథ’ ఆలోచనల్ని రేకెత్తిస్తుంది.

– హరిత, ఈనాడు-ఆదివారం, 27/04/2015.

తలుగు” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగె లో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి..

తలుగు on kinige

Talugu600

 

Related Posts:

నిరుపేద జీవితాల నిలువెత్తు చిత్రాలు

వేంపల్లి షరీఫ్ రాసిన కథల సంపుటి “జుమ్మా” పై “నిరుపేద జీవితాల నిలువెత్తు చిత్రాలు” అనే శీర్షికతో 29/01/2012 నాటి ఆంధ్రభూమి దినపత్రిక అక్షర పేజీలో సౌభాగ్య సమీక్ష ప్రచురితమైంది.

ఈ పుస్తకంలోని 12 కథలు వ్యధార్థ జీవిత యథార్థ గాథలని, రచయిత ఎట్లాంటి ఉద్వేగాలకు, సెంటిమెంట్లకు లోనుకాకుండా కథల్లో తను భాగమయిన దయనీయ పేదతనాన్ని కళ్ళముందు నిలిపారని సమీక్షకులు పేర్కొన్నారు. కథలల్లడానికి ఈ రచయితకి చిన్న సంఘటన, చిన్న సమస్య అందితే చాలని, దానికి చిత్రిక పడతాడని సౌభాగ్య అన్నారు.

ఈ కథలలో చిన్ని వస్తువులు, అల్పమయిన అవసరాలు కూడా అమర్చుకోలేని, తీర్చుకోలేని జీవితాల్ని చూసి చదువరుల గుండె ఝల్లుమంటుందని సమీక్షకులు అభిప్రాయపడ్డారు.

సహజమయిన భాషతో సహజమయిన ఆవిష్కరణతో పాఠకులని ఆశ్చర్యానికి లోనుచేసే కథలివి. ప్రపంచీకరణలో నాశనమవుతున్న గ్రామీణుల జీవితాలివి.

పూర్తి సమీక్షని చదవడానికి ఈ లింక్‍పై నొక్కండి

జుమ్మా కథల సంపుటి ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్‍ని అనుసరించండి.

జుమ్మా On Kinige

Related Posts: