సుపరిచితం – ‘అపరిచితం’ పుస్తకం పై సమీక్ష

బాగా తెలుసుననిపిస్తుందిగాని దేహం పరమ రహస్యం పచ్చి దగాకోరు అంటాడు నరేష్ నున్నాఅపరిచితం‘లో. మనకు బాగా తెలిసిన విషయాల్ని ఏమీ తెలియవన్నట్టు, మనకేమీ తెలియని విషయాలను ఎప్పటికీ తెలుసుకోలేనట్టు చెప్పడంలో నరేష్ చేయి మెలిపడ్డ రచయిత . ఆమె గురించి ఒక అలౌకిక ఆలాపన ఈ ‘అపరిచితం‘ . దేహ రహస్యం గురించి దాపరికం లేకుండా మాట్లాడుతున్నట్టు పైకి కనపిస్తుంది కానీ , కధనాన్ని లోతుల్లోకి వెళ్ళి అర్ధం చేసుకొంటే అనేక దేవ రహస్యాలు అర్ధమవుతాయి.ప్రేమ గురించీ, ఆమెతో చెప్పని వన్‌సైడ్ లవ్ గురించీ జ్ఞాపకాల తలపోత …. ప్రవాహంలా పాఠకులను పరుగులు పెట్టిస్తుంది.

-దేరా,ఆంధ్రజ్యోతి-ఆదివారం,23-11-2014.

AJ_Sunday_Aparachitham_23_11_2014

అపరిచితం” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగె లో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి..

అపరిచితం on kinige

 

Aparichitam600

Related Posts:

పదునైన అస్త్రాలు

కాలక్షేపానికో, కలల్లో విహరింపజేయటానికో కాకుండా ఛాందస, కపటత్వ, రాజీధోరణులపై విమర్శాస్త్రాలు గురిపెడుతూ సాగిన కథల, వ్యాసాల సంకలనమిది. అమెరికాలో తెలుగువారి జీవితంలోని పార్శ్వాలూ, సాహిత్య విమర్శలూ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. భార్యగా వచ్చిన స్త్రీకి మానసికవ్యాధి వచ్చేలా ప్రవర్తించి, ఆమె చనిపోగానే నిత్యపెళ్ళికొడుకు అవతారమెత్తాలని వెంపర్లాడే ఓ వ్యక్తి కథ ‘పెళ్ళాల పులి‘. తమ మతవిశ్వాసాలనో, నాస్తిక భావాలనో చాలామంది తమ పిల్లల్లో కలిగించలేకపోవటం చూస్తుంటాం. ఈ ఇతివృత్తంతో ‘తండ్రి’తనం కథ నడిచింది. ఆఫీసులకు పెంపుడుకుక్కల్ని తీసుకువచ్చే అమెరికన్‌ ఉద్యోగుల చేష్టలను హాస్య వ్యంగ్య ధోరణిలో చిత్రించిన కథ ‘గొర్రెల స్వామ్యం’. ఒక రచన పాఠకునిపై ఎంత గాఢమైన ప్రభావం చూపగలదో ‘నన్ను మార్చిన పుస్తకం’ తెలుపుతుంది.

— సీహెచ్‌.వేణు, ఈనాడు ఆదివారం అనుబంధం, 2 ఫిబ్రవరి, 2014

* * *

‘పెళ్ళాల పులి’ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ చూడండి.

పెళ్ళాల పులి on Kinige

 

Related Posts: