“అగ్నిహంస” పుస్తకావిష్కరణ

 

సుప్రసిద్ధ అవధాని, కవి అయిన రాళ్ళబండి కవితాప్రసాద్ కవిత్వ సంకలనం "అగ్నిహంస". ఈ పుస్తకం 21 మే 2011 నాడు రవీంద్రభారతిలో విడుదలైంది.

ఈ పుస్తకం విడుదల కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడలేకపోయిన కవితాప్రియులకు గొప్ప అవకాశం – ఈ కార్యక్రమం వీడియోలను వీక్షించడం.

ఈ క్రింది లింక్‌లలో పుస్తకావిష్కరణని చూడండి.

 

ఈ పుస్తకం యాభై కవితల సమాహారం. ఒక పరిణత కవి ప్రకృతితో, సామాజిక సంవేదనలతో మమైక్యమై మనసు భాషతో తన హృదయఘోషను కవితాత్మకంగా వెలువరించిన కావ్యమిది. కవితాప్రసాద్ గారి పద్యం ఎంత పొగరుగా, బిగువుగా ఉంటుందో, వచన కవిత్వం అంత గంభీరంగా, పదచిత్రాలతో చమత్కారాలతో, ఆధునిక కాలానికి అద్దం పట్టే భావాలతో సాగుతుంది. ఈ ఆధునిక వచన కావ్యం ఇప్పుడు కినిగెలో డిజిటల్ రూపంలో లభిస్తుంది. ఈ క్రింది లింక్ చూడండి.

Related Posts: